Jr NTR: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన తాజా ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై,బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, సినీ ప్రేక్షకులు చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అభిమానుల అంచనాలకు మించి సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా ఎవరూ ఊహించని విధంగా భారీగా వసూళ్లను సాధించింది.
అలాగే ఈ సినిమాలో నటించిన ఇద్దరు స్టార్ హీరోలకు కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తరువాత చెర్రీ, తారక్ లకు బాలీవుడ్ లో సినిమా ఆఫర్ లు వచ్చే అవకాశాలు చాలావరకు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో,జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అభిమానులకు సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం కూడా బాగా నచ్చాయి.ఇక అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సినిమాలో అన్ని సన్నివేశాలతో పాటు ఒక సన్నివేశం బాగా నచ్చిందని అందుకోసం చాలా బాగా కష్ట పడ్డాను అని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.
సినిమాలోని కొమరం భీముడో పాటలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన సీన్ ల కోసం చాలా కష్టపడ్డానని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఆ పాటలో నటించడం అంత సాధారణమైన విషయం కాదని,అందులో చాలా రకాల భావోద్వేగాలను, ఎమోషన్ లను చూపించాల్సి వచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. కాబట్టి తనకు ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపుగా 500 కోట్లకు పైగా గ్రాస్ ను కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది దూసుకుపోతోంది. ఇక రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి మరి.