Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.ఇక ఈ సినిమాని మే 12వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం పెద్ద ఎత్తున సన్నాహాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి గత నెల కళావతి అనే పాటను విడుదల చేశారు.ఈ పాట సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.ఇక ఈ పాటకు ఎంతోమంది డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఈ పాటకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సైతం అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. ఇలా ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి పెన్నీ అనే పాటను ఆదివారం విడుదల చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో శనివారం విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఒక్కసారిగా ఈ పాటలో మహేష్ బాబు కూతురు సితార కనిపించడంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆశ్చర్యపోయారు. అసలు మహేష్ బాబు సినిమాలో సితార ఏంటి అంటూ ఎంతో మంది ఆశ్చర్యపోయారు.
అయితే ఈ పాట కోసం ఈ పాటలో డ్యాన్స్ చేయడం కోసం వేరే ఒక అమ్మాయిని వెతుకుతున్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ కి ఆ అమ్మాయి స్థానంలో వేరే ఎందుకు సితార అయితే కరెక్టుగా సరిపోతుంది కదా అని ఆలోచన వచ్చింది.ఇక ఇలాంటి ఐడియా రావడంతో వెంటనే మహేష్ బాబు దగ్గరకు వెళ్లి తనతో ఈ విషయాన్ని చెప్పగానే వెంటనే మహేష్ బాబు సితార కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా మహేష్ బాబు సినిమాతోనే తన కూతురు వెండితెర ఎంట్రీ ఇవ్వడంతో మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎస్.ఎస్.తమన్ ప్రమేయంతోనే సితార తెలుగు తెరకు సర్కారీ వారి పాట చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World