Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఈ నెల 25వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ను సంగీత దర్శకుడు కీరవాణి ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి ఈ ఇద్దరు హీరోలను వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ వారి దగ్గర్నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఉద్దేశిస్తూ కీరవాణి ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. ఇకపోతే తన తండ్రి నందమూరి హరికృష్ణ నటించిన సీతయ్య సినిమాని రీమేక్ చేస్తావా అంటూ కీరవాణి ఎన్టీఆర్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆసక్తికరమైన సమాధానాన్ని చెప్పారు.తన తండ్రి నటించిన సీతయ్య సినిమాని తప్పకుండా రీమేక్ చేస్తానని చెప్పడమే కాకుండా ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ కొన్ని కండీషను కూడా పెట్టారు.
తన తండ్రి నటించిన సీతయ్య సినిమాలో ఎన్టీఆర్ నటించాలంటే తప్పకుండా ఈ సినిమాకి సంగీత దర్శకత్వం కీరవాణి అందించాలని కండిషన్ పెట్టారు. అదేవిధంగా ఈ సినిమాలో హరికృష్ణ చెప్పిన డైలాగ్
వినపడదు, వినలేదు, వినడు అనే డైలాగ్ తప్పనిసరిగా ఉండాలనే కండిషన్ పెట్టారు. ఇలా ఈ రీమేక్ సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World