RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా 25వ తేదీ ప్రేక్షకులముందుకు రానుంది. గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో మూడు రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ సినిమా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఏర్పడింది. సాధారణంగా ఒక హీరో అంటేనే థియేటర్లలో అభిమానుల రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే తెరపై సందడి చేస్తే వారి అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ హీరోలకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని థియేటర్ ఓనర్స్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే థియేటర్లలో ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు.సాధారణంగా థియేటర్లో స్క్రీన్ కి సీట్లకు ముందు ఖాళీ ప్రదేశం ఉంటుంది.ఇక అభిమాన హీరోల సినిమాలలో ఏవైనా యాక్షన్ సన్నివేశాలు లేదా పాటలు వస్తే అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి డాన్స్ వేయడం లేదా స్క్రీన్ ముందు పొడియం దగ్గరకు వెళ్లి రచ్చ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే పుష్ప సినిమా విడుదలైన తర్వాత అభిమానులు ఏకంగా స్క్రీన్లను చింపేయడం కూడా మనం చూసాము.ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా విషయంలో ఇలాంటి సంఘటనలు మరింత ఎక్కువగా చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓనర్స్ ముందస్తుగా స్క్రీన్ కు సీట్లకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఇనుప మేకులను అమర్చారు. అదేవిధంగా పోడియం ముందు ఉన్న ప్రాంతంలో ఇనుప కంచె ఏర్పాటు చేశారు.ఇలా థియేటర్ లు ధ్వంసం కాకుండా థియేటర్ ఓనర్లు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.