Intinti Gruhalakshmi March 17th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి దివ్య నానా హంగామా చేస్తుంది. ఇంతలో తులసి అక్కడికి వచ్చి మీ ఫ్రెండ్స్ కి ఏమేమి కావాలో బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోండి అని సలహా ఇచ్చి వెళుతుంది. మరొక వైపు శశికళ అప్పు తీర్చడం కోసం తులసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్యాక్టరీని తాకట్టు పెట్టి బ్యాంకు లోన్ తీసుకొని రావాలి అన్న నిర్ణయానికి వస్తుంది.
ఇక ఇంతలో తులసి కంపెనీ లోన్ ఇవ్వడం కోసం బ్యాంక్ మేనేజర్ వస్తాడు. ఆఫీస్ కి వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఆల్రెడీ కంపెనీ లోనే ఉంది అని చెప్పగా అడిషనల్ లోన్ కావాలి అని చెబుతోంది తులసి. అందుకు అడిషనల్ లోన్ ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి మేనేజర్ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత మేనేజర్ అడ్డదారిన వెళ్దాం మేడం అని చెప్పగా తులసి అందుకు ఒప్పుకోలేదు. నా వల్ల ఎంతో మంది రోడ్డున పడతారు అది నాకు ఇష్టం లేదు అని చెబుతుంది.ఇక లాస్య కి వంట రాకపోవడంతో బయట నుంచి ఫుడ్డు తెప్పిస్తుంది. అయితే ఆ ఫుడ్ కి సంబంధించిన డబ్బులను అందరి దగ్గర తీసుకోమని చెప్పగా, అప్పుడు నందు బాధపడుతూ ఎనిమిది వేల రూపాయలు బిల్ కడతాడు.
మరొకవైపు దివ్య స్నేహితులతో కలసి ఆ ఫుడ్ ని తింటూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ ఫుడ్ లో సగం తిని సగం టేబుల్ ఫై పడేసి ఉంటారు. ఇంతలో ఇంటికి వచ్చిన తులసి డైనింగ్ టేబుల్ పై ఉన్న ఆ ఫుడ్డు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నందు కూడా ఆ ఫుడ్ ని చూసి మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇంతలో కోపంతో తులసి దివ్య అని పిలిచి ఏంటి ఇది అని అడగగా.. అప్పుడు దివ్యా కొంచెం పొగరుగా సమాధానం ఇస్తుంది.
కోపం వచ్చిన తులసి నోరు ముయ్యి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ తులసి కోప్పడగా.. దివ్య ఏమాత్రం తగ్గకుండా తులసికి సమాధానాలు చెబుతూ.. నేను ఇది నీ డబ్బులతో ఏం తెచ్చుకో లేదు ఇవి మా నాన్న డబ్బులు అర్థం అయిందా అని అనడంతో.. కోపంతో తులసి దివ్య చెంప చెల్లు మనిపిస్తుంది.
ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు దివ్య.. నీ డబ్బులు నా డబ్బులు అనే వేరు చేసి మాట్లాడుతున్నావు ఇంకొకసారి ఇలా మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది తులసి. కోపంతో దివ్య నందుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నందు దివ్య కి సపోర్ట్ మాట్లాడుతూ తులసిపై కోప్పడతాడు.
అప్పుడు దివ్య తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి తులసీ మొహం పై విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు ప్రేమ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని కలవడానికి వెళ్లగా.. అక్కడ అతను ప్రేమను చాలా సేపు వెయిట్ చేయించి చివర్లో గర్వంగా మాట్లాడుతాడు. కానీ ప్రేమ్ కి అతను మాట్లాడే తీరు నచ్చకపోవడంతో అక్కడి నుంచి వద్దనుకుని వెళ్లిపోయారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha: అందరికీ దూరమైపోతా అంటున్న ఆదిత్య.. బాధతో కుమిలిపోతున్న రుక్మిణి..?