Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
హోలీ పండుగ సందర్భంగా జరిగిన అవమానానికి ఆదిత్య కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడు రాధ ఇప్పుడు ఏమైంది పెనివిటి అంతలా బాధపడుతున్నావ్.. అసలు నువ్వు ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు కదా అంటుంది రాధ అప్పుడు ఆదిత్య అనే నేను ఎక్కడ ఉన్న నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది రాకుండా ఎలా ఉండగలను అని అంటాడు.
నువ్వు నాకు కనిపించకు ముందే బాగుండేది నువ్వు కనిపించిన తర్వాత ప్రతి క్షణం నేను నరకం అనుభవిస్తున్నాను.. నావల్ల ఎవరికీ సంతోషం లేదు.. అసలు నేను ఆడేవాడిని లేకుండా ఉంటే అందరు ఎంత సంతోషంగా ఉంటారు నీతో సహా అంటూ ఆదిత్య ఏడుస్తూ ఉంటాడు.. ఆ మాటలు విన్న రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఆదిత్య మాటలకు కంగారు పడ్డ రాధ అలా మాట్లాడకు పెనిమిటి నాకు భయమేస్తుంది అంటుంది. అలా దేవి గురించి రాధ ఆదిత్య మాట్లాడుతూ బాధపడుతూ ఉంటారు. కన్న బిడ్డ ముందే దొంగలా దోషిగా నిలబడటం కంటే దూరంగా ఎటైనా వెళ్లి పోవడం మంచిది అని అంటాడు ఆదిత్య. అప్పుడు రాధ అలా మాట్లాడకు పెనిమిటి.. నువ్వు లేకపోతే నా చెల్లెలు సత్య బతుకు ఏమవుతుంది..
ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తుంది రాద. నాకు కూడా నా కన్న బిడ్డ నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు అని అడిగిన తర్వాత నేను ఇంకా ఎందుకు ఉన్నాను అర్థం కావడం లేదు అని ఆదిత్య ఆవేదనగా అనడంతో ఆ మాట ఎప్పుడూ అనకు పెనిమిటి.. దీనికంతటికీ కారణం నేనే.. ఇంతమందిని బాధపెట్టి నేను చేసేది ఏముంది..
నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను ఆ లోపు నువ్వు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకు.. ఇన్నాళ్లుగా నేను ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు కానీ ఈ ఒక్కసారికి నా మాట విను ఇలాంటి నిర్ణయాలు మానుకో పెనిమిటి ఆ లోపు నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది రాధ. ఇక కారులో నుంచి దిగి వస్తున్న మాధవా ని చూసి కారులో ఎక్కి వెళ్లి ఇంటికి వెళ్లి పోతుంది రాద. ఇక జరిగిన విషయం గురించి తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..
Tufan9 Telugu News And Updates Breaking News All over World