Guppedantha Manasu May23 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు బయట హోటల్లో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇక ఈ రోజు ఎపిసోడ్ లో వసు, రిషి హోటల్ లో కాఫీ తాగుతూ ఉండగా ఇంతలో వసు మూతికి కాఫీ అంటుకుంటుంది. అది చూసి రిషి ఫోటో తీసి వసుధార కు చూపించగా ఇవే తీపి జ్ఞాపకాలు సార్ అని అంటూ తుడుచుకోబోతుండగా అప్పుడు రిషి కర్చీఫ్ ఇస్తాడు. వీరిద్దరూ కలిసి నవ్వుతూ ఉండగా సాక్షి చూస్తుంది.
ఆ తర్వాత వసు, రిషి ఇద్దరూ కలిసి హోటల్ కి వెళ్ళి అక్కడ రూమ్స్ లేకపోవడంతో ఒకటే రూమ్ తీసుకుంటారు. అప్పుడు వసు రిషి సార్ తో ఒకే రూమ్ లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దేవయాని రిషి కి ఫోన్ చేయడంతో రిషి ఫోన్ కట్ చేస్తాడు.
ఆ తర్వాత రూమ్ లో వసు,రిషి ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటారు. ఆ తరువాత రిషి వసు ని చదువుకోమని చెప్పి బయట కార్ లో వెళ్లి పడుకుంటాడు. ఇంతలో సాక్షి ఆ రెస్టారెంట్ కి వచ్చి రిషి, వసు ల గురించి ఎంక్వయిరీ చేస్తుంది. ఇంతలోనే దేవయాని మళ్ళీ రిషి ఫోన్ చేయడంతో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెద్దమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
రిషి ప్రవర్తన అర్థంకాక దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కారులో కూర్చున్న రిషి నేను ఏంటి?నేను ఇలా వసుధార కోసం రావడం ఏంటి? ఇలా కారులో పడుకోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు.. ఇంతలో కారులో లవ్ ఎఫ్ ఎం వారికి కాల్ చేసి లవ్ టిప్స్ అడుగుతాడు.
రేపటి ఎపిసోడ్ లో వసు, ఎగ్జామ్ రాయడానికి వెళుతుండగా రిషి వసు చేయి పట్టుకొని నేను ఎప్పటినుంచో నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది ఈరోజు చెప్తాను. ఇది చాలా ముఖ్యమైన రోజు గుర్తుండిపోయే రోజు అని అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu: ఒకే రూమ్ లో వసు, రిషి.. టెన్షన్ పడుతున్న దేవయాని సాక్షి..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World