Guppedantha Manasu May21 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ వసు, రిషి సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం కూడా రాలేదు ని బాధపడుతూ ఉంటుంది.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర జగతిలో రోడ్డుపై నిల్చుని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అటువైపు రిషి వెళ్తాడు. రిషి వెళ్లడం చూసిన మహేంద్ర జగతి తో పందెం కట్టి ఖచ్చితంగా రిషి,వసు కోసం వచ్చాడు అని అంటాడు మహేంద్ర. అప్పుడు రిషి కి కాల్ చేసి అడగగా నేను ఇంటికి వెళుతున్నాను డాడ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రిషి.
మరొకవైపు వసుధార బస్సు లో కూర్చొని పక్క సీట్లో రిషి ఉన్నట్లుగా ఊహించుకొని మాట్లాడుతూ ఉంటుంది. వసు ఊహించుకున్న విధంగానే రిషి బస్సు కి కారు అడ్డంగా ఆపి వసుధారని కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అప్పుడు వసుధారా ఎక్కడికి సార్ అని అడుగుతుండగానే కారులో ఎక్క అని చెప్పి కారులో తీసుకొని వెళ్తాడు.
ఎగ్జామ్ కి బస్సులోనే వెళ్లాలా నా కారులో వెళ్లకూడదా అని అంటాడు. ఆ మాటకు వసుధార చాలా ఆనంద పడుతుంది. మీరు వచ్చినందుకు చాలా థాంక్స్ సార్ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని అంటుంది. మరొకవైపు మహేంద్ర, రిషి కొంపదీసి వసుధార తో కలిసి వెళ్లాడా అని అనుమాన పడగ అప్పుడు జగతి అలాంటిది ఏమీ లేదు అని అంటుంది..
ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి రిషి కాలేజ్ పని మీద బయటకి వెళ్ళాడు అని చెబుతుంది. కారులో వసుధార చదువుకుంటూ నిద్ర పోతూ ఉండగా అప్పుడు రిషి ఒక డాబా దగ్గర ఆపి కాఫీ తాగడానికి వెళ్తారు. అక్కడ ఒక వ్యక్తి వసుంధర కి లైన్ వేస్తుండగా అప్పుడు రిషి వసుని పక్కన కూర్చో పెడతాడు.
ఎందుకు సార్ అని వసు అడగగా లోకకళ్యాణం కోసం అని అంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా రిషి, వసు ఇద్దరూ కలసి సింగిల్ బెడ్ రూమ్ తీసుకుంటారు. అప్పుడు రిషి సార్ తో ఒకే రూమ్ లో ఎలా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సాక్షి వచ్చి వారి గురించి ఎంక్వయిరీ చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu: రిషి కోసం బాధ పడుతున్న వసు..వసు పై మాస్టర్ ప్లాన్ వేసిన దేవయాని,సాక్షి..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World