...

Big Boss OTT: ఫస్ట్ నైట్ గురించి మాట్లాడిన శివకు వార్నింగ్ ఇచ్చిన అరియాన..!

Big Boss OTT: ప్రస్తుతం ఓటిటిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకి మునుపటి సీజన్ లతో పోలిస్తే ప్రేక్షకాదరణ తగ్గిందనే చెప్పాలి. ఇదివరకు టెలివిజన్ లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు మాత్రం ఓటిటిలో 24/7 ప్రసారమవుతోంది. ఏడు వారాల క్రితం 17మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ రియాలిటీ షో లో 11 మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు. అయితే ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలు బూతు పురాణాలు ఎక్కువయ్యాయి. డబుల్ మీనింగ్ డైలాగులతో షో ని బ్రష్టు పట్టిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షోని ఆడ, మగ అని తేడా లేకుండా విచ్చలవిడిగా పచ్చి బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ గబ్బు పట్టిస్తున్నారు. షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ లు సెక్స్ గురించి పచ్చిగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఈ శుక్రవారం ఎపిసోడ్ లో భాగంగా ఇచ్చిన టాస్క్‌లో భాగంగా వారి వారి జీవితాల్లో జరిగిన ఘటనలు.. పిచ్చి పనులు గురించి చెప్పాలి. ఈ క్రమంలో హమీద ఈవెంట్ మేనేజర్‌గా కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన చిలిపి పనుల గురించి చెప్పుకొచ్చింది. ఫేక్ ఎక్స్పీరియన్స్ తో ఒక వెడ్డింగ్ ఈవెంట్ ని ఒప్పుకుంటే వాళ్ళు తన పనితనం పసిగట్టి చివరకు ఫస్ట్ నైట్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయమని చెప్పారనీ హమీద్ చెప్పుకొచ్చింది.

Advertisement

అయితే ఫస్ట్ నైట్ కి ఏం చేయాలో తనకి,తన ఫ్రెండ్ కి తెలియకపోవడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నామని చెప్పింది. హమీద ఫస్ట్ నైట్ అని చెప్పటంతో అరియనా ఓవర్‌గా ఎగ్జైట్ అవుతూ.. ఎప్పుడైనా ఫస్ట్ నైట్‌లు చేశావా? ఇప్పుడు ఇస్తే చేస్తావా? అని అడిగింది. ఇప్పటివరకూ చేయలేదు కానీ.. నీ ఫస్ట్ నైట్ ఈవెంట్ చేయమంటే చేస్తా అని చెప్పింది.అందుకు అరియానా సిగ్గుపడుతు కావాలని చెప్పింది. ఫస్ట్ నైట్ రోజు ఆ గదిలో నీ స్టోరీలు మొత్తం ఫొటోలుగా పెడతా అని చెప్పింది. అంతలో శివ కల్పించుకొని ఎన్నో ఫస్ట్ నైట్ అన్నది కూడా ఒక బోర్డు పెట్టు అని అంటాడు. దీంతో అరియనా శివని పక్కకి పిలిచి ముందు నువ్ నోటి దూల తగ్గించుకో అని సీరియస్ అవుతుంది. అందుకు శివ నేను ఆ ఉద్దేశంతో అనలేదని క్షమాపణ చెప్తాడు. మొత్తానికి బోల్డ్ మాటలతో బిగ్ బాస్ కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించారు.

Advertisement
Advertisement