Big Boss Telugu: బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలో ప్రసారం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రియాలిటీ షో మొదలై ఇప్పటికి ఏడు వారాలు పూర్తి చేసుకుంది. 17 మంది కంటెస్టెంట్ ల తో మొదలైన ఈ రియాలిటీ షో లో ఇప్పటివరకు ఏడు మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఏడో వారంలో మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పటివరకు స్రవంతి, శ్రీ రాపాక, ముమైత్ ఖాన్, ఆర్ జే చైతు, సరయు, తేజస్వి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడో వారం లో హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన మహేష్ కి నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ లలో ఆరుగురు పుష్పాలు.. నలుగురు ఫైర్ ఎవరో చెప్పమని టాస్క్ ఇచ్చాడు.
ఆషు రెడ్డి, నట్రాజ్ మాస్టర్, అనిల్, అజయ్, మిత్ర,హమీద లను పుష్పాలు చెప్పాడు. మహేష్ అందుకు వివరణ కూడా ఇచ్చాడు. హమీద్ గురించి మాట్లాడుతూ తగ్గెదే లే అని చెప్పి అన్నింటిలోనూ తగ్గుతుంది. ఇక ఆషూ రెడీ విషయానికి వస్తె ఇట్స్ మై స్ట్రాటజీ , ఇట్స్ అప్ టూ యూ అన్న పదాలను ఎక్కువగా వాడుతుంది. ఇక నటరాజ్ మాస్టర్ లో ఫైర్ ఉంది కానీ అది కామెడీ అయిపోతుంది. అని నటరాజ్ మాస్టర్ పరువు తీశాడు. ఇక మిత్ర విషయానికి వస్తె రేలంగి మామయ్యల ఉంటుంది అని చెప్పాడు.
ఇక హౌజ్ లో ఫైర్ కేటగిరీ లో బిందు మాధవి, శివ, అరియన, అఖిల్ పేర్లు చెప్పాడు. అఖిల్ గురించి మాట్లాడుతూ నామినేషన్ల సమయంలో అఖిల్ చేసే డిబేట్ నచ్చుతుంది అని చెప్పాడు. బిందుమాధవి ఒక్కోసారి ఉన్నటువంటి ఫైర్ అయ్యి ఏదో చేద్దామనుకుంటే ఏదో అయిపోతుంది. ఈ అరియాన విషయానికి వస్తే పావలా దానికి పది రూపాయలు ఆలోచించి 20 రూపాయల తలనొప్పి తెచ్చుకుంటుంది అని చెప్పాడు. ఇక శివ విషయానికి వస్తే ఏ టైం లో ఎవరిని ఎక్కడ గోకాలో బాగా తెలుసు. గేమ్ లో ఉండి కూడా పని చేయడు అని చెప్పుకొచ్చాడు.