Devotional Tips : సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్లి ఇంటికి రాగానే కాళ్లు కడగకుండా ఇంటిలోకి వెళ్తాము. ఇలా కాళ్లు కడగకుండా లోపలికి వెళ్లడం వల్ల ఎంతో పుణ్య ఫలం కలుగుతుంది. అయితే నవగ్రహాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి రాగానే కాళ్ళు అడుగుతారు ఇలా కాళ్ళు కడగడం మంచిదేనా. నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడిగి లోపలికి వెళ్లడం వల్ల ఎలాంటి దోషం ఉండదని చాలా మంది భావిస్తుంటారు.నిజానికి నవగ్రహాలకు వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్లాలా వద్దా అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం….
సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా గర్భగుడి లో స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం నవగ్రహాలకు పూజ చేయాలి. నవగ్రహాల పూజ చేయడం వల్ల మన జాతకంలో వున్న దోషాలు మొత్తం తొలగిపోతాయి. ఇలా దోష నివారణ కోసమే నవగ్రహ పూజ చేస్తారు. ఇలా పూజ అనంతరం ఎక్కడ ఉండకుండా సరాసరి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడగకుండా లోపలికి వెళ్లాలి. ఇలా చేసినప్పుడే మనకు ఉన్న దోషనివారణ తొలగిపోతుంది.
ఇలా కాకుండా ముందుగా నవగ్రహ పూజ చేసి అనంతరం గర్భగుడిలో ఆలయాన్ని దర్శనం చేసుకోకూడదు. అలాగే నవగ్రహాల దర్శనం చేసుకున్న తర్వాత ఇతర పనుల నిమిత్తం వేరే చోటికి వెళ్ళకూడదు.నవగ్రహ పూజ అయిపోగానే సరాసరి ఇంటికి చేరుకోవాలి అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం ఉంటుంది. కనుక నవగ్రహాల పూజ అనంతరం ఎవరూ కూడా కాళ్ళు కడకుండా ఉండటమే మంచిది.
Read Also : Astrology: రాహువు ప్రభావం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Tufan9 Telugu News And Updates Breaking News All over World