...

Lord Shani : శనిదేవుడి అనుగ్రహం కలిగి శని దోషం తొలగిపోవాలంటే ఇలా పూజ చేయాలి…!

Lord Shani : మాములుగా శనీశ్వరుడు పేరు చెప్పగానే చాలామంది భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడు ప్రభావం జీవితంలో ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు.కొంతమంది అయితే శనీశ్వరుడి గుడికి వెళ్ళాలన్న కూడా భయపడుతూ ఉంటారు. శనీశ్వరుని పూజించడం వల్ల ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడట. మరి శనీశ్వరుని ఏ విధంగా పూజించాలి. అందుకు ఎటువంటి పూజలు చేయాలి. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది శనీశ్వరుడుని ఎక్కువగా శని శని అని పిలుస్తూ ఉంటారు. అయితే శనీశ్వరుని ఎప్పుడూ కూడా శని అని పిలువకూడదట శనీశ్వరుడు అని మాత్రమే పలకాలి.

if-you-want-to-get-rid-shani-effect-you-have-to-worship-like-this-in-telugu
if-you-want-to-get-rid-shani-effect-you-have-to-worship-like-this-in-telugu

ఎందుకంటే ఈశ్వర అన్న శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. అందుకే శనీశ్వరుడి పేరులో శని, ఈశ్వర అనే రెండు శబ్దాలు వినిపిస్తుండడంతో, శని దేవుడిని శివుడిలా, వెంకటేశ్వరునిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలామంది శని దేవునికి భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే నవగ్రహ మండపానికి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేసి శనివారం నియమాన్ని పాటించడం వల్ల, అదేవిధంగా నీలం లేదా నలుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శివారాధన చేయడం వల్ల, చిమ్మిలి నివేదనం చేయడం వల్ల ఆ శనీశ్వరుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఎవరైతే శనీశ్వరుడిని భక్తిగా పూజించి, గౌరవిస్తారో అటువంటివారిని శనీశ్వరుడు తప్పక అనుగ్రహిస్తాడు.

అంతే కాకుండా ఎప్పుడు కూడా శని పీడ రావాలనే కోరుకోవాలట. ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ మీకు అందించి వెళ్తాడు. మాకు శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం, ఐశ్వర్యం కూడా రాదట. చక్కగా నీలిరంగు పుష్పాలతో పూజించి, శివారాధన, హనుమాన్, అయ్యప్ప ఆరాధనా చేయాలట. అలాగే శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడట. కొద్ది ఇబ్బందులు ఎదురైనా అంతకు మించి ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also : Shani Dev : శని దేవుని కృపతో ఈ ఐదు రాశుల వారికి అద్భుత ఫలితాలు..?