Hairy tips : చాలా మంది తెల్లజుట్టుతో బాధపడుతుంటారు. దాన్ని కవర్ చేసుకునేందుకు అనేక రకాల రంగులు, షాంపోలు, హెయిర్ కండీషనర్ , సిరమ్ లు, హెయిర్ స్ప్రేలు వాడుతుంటారు. వీటి వల్ల అప్పటి మందం తెల్ల రంగు నల్లగా కనిపించినా నెల గవడక ముందే మళ్లీ తెల్లబడుతుంది. అయితే వీటన్నిటికి చెక్ పెడుతూ… సహజ పద్ధతిలో తెల్ల రంగును నల్లగా చేసుకోవచ్చు. అయితే ఈ చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు గింజ తొలగించిన కుంకుడు కాయలు, గుప్పెడు ఎండబెట్టిన కరివేపాకు వేసి మొత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టి గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల టీ పౌడర్ ను ముందుగా గ్రైండ్ చేస పెట్టుకున్న మశఇర్మంలో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించి.. ఆపై వాటర్ ను స్ట్రైనర్ సాయంతో సెపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ లో నాలుగైదు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకొని అన్ని కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆపై మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి. రెండు గంటల తర్వాత మైల్ట్ షఆంపూను యూజ్ చేసి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ తెల్ల జుట్టు వారం రోజుల్లోనే నల్లగా తయారు అవుతుంది.