Curry leaves : ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కాలుష్యం, మానసిక ఒత్తిడి, రసాయనాలు కల్గిన షాంపూలు వాడడం, మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అయితే ఈ సమస్యను తగ్గించుకొని బలమైన జుట్టును సొంతం చేుకోవాలంటే వేలకు వేలు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న కరివేపాకుతోనే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కరివేపాకుని సేకరించి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత దీనికి పెరుగును కలిపి జుట్టుకు రాసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా ప్రతీ రోజు చేయడం వల్ల జుట్టుకు తగినంత తేమ అందుతుంది. అలాగే కుదుళ్లు బలంగా తయారవుతాయి. కరివేపాకుతో ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు సంబంధిత సమత్యతో బాధపేడవారు కరివేపాకుతో కషాయాన్ని చేసుకొని తాగాలి. దాని వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. శరీరంలోని మలినాలు తగ్గిపోయి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కాబట్టి మీరూ ఓ సారి వాడి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది.
Read Also : Hairy tips : నల్ల జుట్టును తెల్లగా మార్చే అద్భుతమైన చిట్కా..!