...

Actress Samantha : నిజాలు మాట్లాడొద్దని ” సమంత ” కి ఆంక్షలు పెట్టింది వాళ్లేనా ?

Actress Samantha : టాలీవుడ్ లో ” సమంత ” కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ… తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. సమంత నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

కాగా అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది సమంత. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట 2021 లో విడాకులు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ఇక విడాకుల అనంతరం సామ్ తన కెరీర్ పై దృష్టి సారించింది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదుర్స్ అనిపించుకుంది సామ్.

ఓ వైపు సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తూ… సినిమా షూటింగ్ ల నుంచి ఏ మాత్రం తీరిక దొరికినా విహారయాత్రలకు చెక్కేస్తోంది సామ్. తన విడాకుల ప్రకటన అనంతరం తొలినాళ్లలో హరిద్వార్, రుషికేష్ లాంటి ప్రాంతాల్లో పర్యటించింది. ఇక ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తోంది సమంత. ఈ మేరకు ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

ఈ మేరకు ” మంచులో స్కైయింగ్ చేస్తున్నాను, నీ ఇగోను ఇంటి వద్దే వదిలేయమని వాళ్లు చెప్పారు. నిజాలు మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టారు ” అంటూ రాసుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా సమంతా ఇండైరెక్ట్ గా ఎవరి గురించి రాసిందా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తిచేసిన సామ్… త్వరలోనే యశోద మూవీ సెట్ లో అడుగపెట్టనుంది. ఇంకా కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా వరుసగా ప్రాజెక్టులకు ఓకే చెబుతోందీ ఈ ముద్దుగుమ్మ.

Read Also : Guppedantha Manasu : దిక్కుమాలిన అంటూ జగతిని దారుణంగా బాధ పెట్టిన దేవయాని!