...

Akkineni Nagarjuna : ఆ మాట నేను అనలేదు.. సమంత-నాగచైతన్య విడాకుల వార్తలపై నాగార్జున క్లారిటీ

Akkineni Nagarjuna : సోషల్ మీడియాలో సమంత-నాగచైతన్య విడాకులకు సంబంధించి వస్తున్న వరుస కథనాలపై అక్కినేని నాగార్జున స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో నా పేరుతో వస్తున్న కామెంట్లలో ఎలాంటి నిజం లేదని నాగర్జున క్లారిటీ ఇచ్చారు. సమంత, నాగచైతన్యల విడాకుల విషయంలో నేను మాట్లాడినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని నాగర్జున కొట్టిపారేశారు. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంత గతేడాది అక్టోబర్ 2న తమ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ఇద్దరు ఒకేసారి సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అప్పటినుండి చైతూ, సామ్ ఎవరి పనులు వాళ్లు బిజీలో ఉండిపోయారు. అయితే వారిద్దరూ విడిపోవడంపై సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలు ఉన్నాయి. సమంత-నాగ చైతన్యల విడాకుల విషయంలో నాగార్జున అలా అన్నారంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో నాగార్జున చెప్పారంటూ వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలోనే కాదు… వెబ్ సైట్స్, టీవీ ఛానళ్లలోనూ ఇదే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

చైతన్యని సమంతే విడాకులు కావాలని అడిగిందని ఆ వార్తల్లో వచ్చింది. ఈ మాట తాను అన్నట్టుగా వస్తున్న వార్తలపై నాగార్జున స్పందించారు. తాను చెప్పినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. అలాంటి పుకార్లను వార్తలుగా మల్చవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ నాగార్జున ట్వీట్ చేశారు. #GiveNewsNotRumours అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారు.

Read Also : Health Tips : ఆల్కహాల్ తాగడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా… అవి ఏంటంటే ?