...

Samantha : బిల్డప్‌కు పోయి బాలీవుడ్‌లో బోల్తాపడ్డ సమంత..!

Samantha : టాలీవుడ్ లవర్ బాయ్ నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంతకి రెక్కలు వచ్చినట్టు అయ్యింది. స్వేచ్ఛగా ఓ పక్షిలా తనకి నచ్చినట్టు బాగా విహరిస్తోంది. ఇక ఒకప్పుడు అంటే అక్కినేని వారి ఇంటి పెద్ద కోడలు కాబట్టి ఆమెకు బోలెడన్ని షరతులు ఉండేవి.ఇక ఇప్పుడు అలాంటి షరతులు అసలు ఏమి లేవుగా.బికినీ ఫోటోలు, ఐటెం సాంగ్ లు ఇంకా ఇంటిమేట్ సన్నివేశాలు.. ఇలా తనకు సినిమాల్లో ఏది కావాలంటే అది చేయొచ్చని ఫిక్స్ అయ్యింది. అందుకే ‘పుష్ప’ సినిమాలో ఏకంగా ‘ఉ అంటావా మావ ఉఊ అంటావా’ అంటూ ఓ ఐటెం సాంగ్ లో బాగా ఎక్సపోజ్ చేసి మరి ఈ అమ్మడు చిందులు వేసింది.

ఇండైరెక్ట్ గా సామ్ నాగ చైతన్య పై అలాగే మగాళ్ళ పై సెటైర్లు వేసినట్టు ఆ పాట ఉంటుంది కాబట్టి.. సమంత ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇక మరో పక్క నిర్మాతల వద్ద నుండీ కూడా ఆ పాట కోసం భారీ మొత్తంలో కోటి 50 లక్షలు బాదిందట. నిజానికి సమంత పారితోషికం ఒక్క సినిమాకి వచ్చేసి రూ.2 కోట్ల లోపే ఉంటుంది. కానీ ‘పుష్ప’ లో ఓ పాట కోసమే అంత ఎక్కువ మొత్తం అందుకుంది. తెలుగులో సమంతకి అది పెద్ద లెక్కే అని చెప్పాలి. కానీ బాలీవుడ్ మార్కెట్ కి ఇంకా అక్కడి మేకర్స్ కు అది పెద్ద అమౌంట్ అయితే కాదు.

అందుకోసం ‘పుష్ప’ ఐటెం సాంగ్ కు సమంత ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు అక్కడి మేకర్స్ కు ఈ బ్యూటీ తెలిపిందట.ఆ నెంబర్ చెప్పి అక్కడి మేకర్స్ నుండీ ఇంకా ఎక్కువ డబ్బులు బాదొచ్చు అనేది సమంత ఫాక్స్ ప్లాన్. అయితే ఆ మేకర్స్ కాస్త మన ‘పుష్ప’ నిర్మాతల్ని సంప్రదిస్తే సమంత మోసం బయటపడింది. పుష్ప నిర్మాతలు ‘అబ్బే లేదు ఆమెకి కోటిన్నరే ఇచ్చాము’ అని డైరెక్ట్ గా వారికి చెప్పేశారట.ఇక అంతే సమంత బండారం దెబ్బకు బయటపడిపోయింది.ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కడి బాలీవుడ్ మీడియా సమంత పై బాగా సెటైర్లు వేస్తుంది. అనవసరంగా బిల్డప్ కి పోయి నవ్వులపాలైందని సమంతని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

Read Also : Trending News : రీల్ సీన్ రియల్ లైఫ్ లో రిపీట్… సిబ్బందికి షాక్ ఇచ్చిన రైతు !