Trending News : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ స్నేహం కోసం ’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో చిరంజీవి, విజయ్ కుమార్ కలిసి కారు కొనేందుకు ఓ షోరూమ్‌కు వెళ్లగా… వారి వేషధారణ, మాట తీరు చూసి అక్కడి సిబ్బందిని అవమానిస్తారు. ఆ తర్వాత గోనె సంచిలో నుంచి డబ్బుల కట్టలు కిందపోయగా… ఒకింత షాకై తప్పు తెలుసుకుని కారును విక్రయిస్తారు. రీల్ లైఫ్ లో జరిగిన ఇదే సీన్ రియల్ లైఫ్ లోనూ జరిగింది. కర్ణాటకలోని తుముకూర్‌లో గల మహీంద్రా షోరూమ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కెంపెగౌడ అనే రైతు తన మిత్రులతో కలిసి బొలెరో పికప్ ట్రక్కు కొనేందుకు వెళ్లారు. లోపలకు వెళ్లిన క్రమంలో వారి వేషధారణపై సెటైర్ వేస్తూ అక్కడి సేల్స్‌మ్యాన్ అవమానకరంగా మాట్లాడాడు. అంతే కాకుండా కారు ధర 10 రూపాయలు అనుకుని వచ్చినట్లు ఉన్నారు.. ఇక బయలుదేరండి అంటూ నోటికొచ్చినట్లు వాగాడు. కారు కొనేందుకు ఇంత మంది రారని ఆ రైతు స్నేహితులను ఉద్దేశించి హేళనగా మాట్లాడాడు. ఈ క్రమంలో సేల్స్‌మ్యాన్ అన్న మాటలకు రైతు కెంపెగౌడకు పట్టలేని కోపం వచ్చింది. గంటలో రూ.10 లక్షలు తీసుకొచ్చి వెంటనే కారు డెలివరీ చేయాలని షోరూమ్ సిబ్బందిని డిమాండ్ చేశారు.
రైతు నుంచి ఊహించని విధంగా వచ్చిన ఈ రిప్లైకి షాకైన సిబ్బంది.. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, ఆయన స్నేహితులకు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన రైతు.. తుముకూర్లోని తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్లో షోరూమ్ సిబ్బందిపై కంప్లైంట్ చేశారు. దీంతో సేల్స్‌మ్యాన్, ఇతర ఉద్యోగులు తమ తప్పు తెలుసు కున్నారు. కెంపెగౌడకు సిబ్బంది బహిరంగ క్షమాపణలు చెప్పారు.
అలానే రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని అందించారు. అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు వివాదానికి ముగింపు పలికారు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు. ఆ సేల్స్ మ్యాన్ ఒకరి కింద నౌకరి చేస్తున్నాడు కానీ.. రైతు తన పొలంతో తాను సాగు చేసుకుంటూ జమిందారీలా బ్రతకుతాడు. అందుకే రైతులకు ఆత్మాభిమానం ఎక్కువ అనే మాట వాస్తవం అని నిజం అనిపిస్తుంది.
Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…
Tufan9 Telugu News And Updates Breaking News All over World