అసలే ఆక్థిక వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న పాకిస్థన్ ప్రజలకు మరో సమస్య వచ్చి పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఆయిల్ అండ్ గ్యాస్ అథారిటీ సూచనల మేరకు ఇంధన ధరలను పెంచాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి శనివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రటించింది. ఇందులో భాగంగానే లీటరు పెట్రోల్‌పై రూ. 83.5, డీజిల్‌పై రూ.119 పెరిగే అవకాశం ఉందని సమాచారం.
అంతే కాకుండా లైట్ డీజిల్‌పైన రూ.77.31, కిరోసిన్పైన రూ.36.5 పెంచాలని భావిస్తోంది పాక్ ప్రభుత్వం. ఈ ధరలు అమలైతే పాక్ ప్రజలకు ఇంధనం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్‌పై 17 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా దీనిని 70 శాతానికి పెంచాలని ఓజీఆర్ఏ ప్రతి పాదించింది. ఈ ధరలపై ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను సంప్రదించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ధరలే కనుక అమలు అయితే పాకిస్థాన్ ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.