Business Idea : రెండు లక్షల పెట్టుబడి పెడ్తే చాలు.. ఇలా నెలకు 50 వేలు ఈజీగా సంపాదించొచ్చు!

Business Idea
Business Idea

Business Idea : చాలా మందికి ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు. తమ కాళ్లపై తాము నిలబడాలని తపన పడుతూ ఉంటారు. కానీ ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు. అయితే ఈరోజుల్లో వంట నూనెకు విపరీతమైన ధర పలుకుతోంది. వంట నూనె తయారీ అంటే ఆయిల్ మిల్లు ప్రారంభించడం వల్ల చాలా లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గతంలో ఆయిల్ మిల్లు ప్రారంభించాలనుకుంటే చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి. అధికంగా ప్లేస్ కూడా అసరం అయ్యేది. ఇప్పుడు మార్కెట్ లోకి పోర్టబుల్ మెషీన్లు రావడంతో తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదనంగా ఈ అధునిక యంత్రాలు పని చేయడానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఆయిల్ వ్యాపారాన్ని ప్రాంరంభించడానికి చమురు శుద్ధి కర్మాగారం కొంచెం పెద్ద ఇల్లు మరియు ఆయిల్ తయారు చేయడానికి అవసరమైన పంట అంటే వేరు శనగ, నువ్వులు లాంటి ధాన్యాలు అవసరం.

Advertisement
Business Idea
Business Idea

ఆధునిక యంత్రాల సాయంతో ధాన్యాల నూనెను అతి తక్కువ సమయంలో చాలా సులభంగా తీయవచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ముందుగా మీడియం సైజు యంత్రాన్ని కొనుగోలు చేయాలి. వ్యాపార లాభాలు పెరిగితే ఆ తర్వాత పెద్దది కొనుక్కోవచ్చు. అయితే ఆయిల్ తయారు చేసే మెషిన్ ధర దాదాపు 2 లక్షలుగా ఉంటుంది. ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు లైసెన్స్ తో సహా కొన్ని ప్రభుత్వ పత్రాలను సేకరించాల్సి ఉంటుంది. మొత్తం మీద 3 నుంచి 4 లక్షల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది, నూనె నాణ్యత బాగుండి కస్టమర్లను ఆకర్షించగల్గితే… వ్యాపారంలో చాలా వేగంగా లాభం పొందవచ్చు.

నూనె వ్యాపారంలో అత్యంత ముఖ్యమైన విషయం వినియోగదారులను ఆకట్టుకోవడం. వ్యాపారం యొక్క ఆదాయం మరియు లాబం వినియోగదారులపై ఆధారపడి ఉంటుంది. ఆయిల్ ను అవుట్ లెట్ గా లేదా దుకాణాదారులతో ఒప్పందం ద్వారా విక్రయించవచ్చు. నూనె తయారీలో మిగిలిన వ్యర్థాలను పశువుల దాణాకు విక్రయించుకోవచ్చు. చమురు వ్యాపార ఆదాయం డిమాండ్ తో పాటు ముడి పదార్థాల ధరపై కూడా ఆధారపడి ఉంటుంది. ముడి సరుకు ధర తక్కువగా ఉంటే ఎక్కవ లాభాలు పొందవచ్చు. మీ వ్యాపారం మంచిగా సాగితే… నెలకు కనీసం 20 వేల నుంచి 50 వేల వరకు సాంపాదించవచ్చు.

Advertisement

Read Also : Business idea : కేవలం రూ. 70 వేలతో అదిరిపోయే బిజినెస్.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన..!

Advertisement