Telugu NewsDevotionalRuna Vimochana Ganesh Sthothram : అప్పుల బాధలు తీరాలంటే.. ఈ స్తోత్రాలు చదివాల్సిందే!

Runa Vimochana Ganesh Sthothram : అప్పుల బాధలు తీరాలంటే.. ఈ స్తోత్రాలు చదివాల్సిందే!

Runa Vimochana Ganesh Sthothram : మీకు ఆదాయం ఎక్కువగా వస్తున్నా చేసిన అప్పులు అస్సలే తీరడం లేదా.. డబ్బులిచ్చిన వాళ్లు వెంట పడి వేధిస్తున్నారా.. మీకిచ్చే వాళ్లు మాత్రం ఇప్పుడే కాదంటూ కాలం దాట వేస్తున్నారా.. ఈ సమస్యలన్నిటి జీవితం మీదే విరక్తి కల్గుతోందా.. అయితే ఈరోజే మీరు రుణ విమోచన స్తోత్రాలు చదివి మీ బాధలను తీర్చుకుోండి. ఈరోజు అనగా ఏప్రిల్ 20 బుధవారం చవితి నాటి నుంచి ఎవరైతే ఈ ఐదు స్తోత్రాలు చదువుతారో వారు కచ్చితంగా బుణ విముక్తులవుతారని వేద పండితులు సూచిస్తున్నారు. అయితే ఆ స్తోత్రాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Runa Vimochana Ganesh Sthothram
Runa Vimochana Ganesh Sthothram

ఋణ విమోచన గణేష స్తోత్రం, ఋణ విమోచన అంగారక స్తోత్రం, ఋణ విమోచన లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రం, దారిద్ర దహన శివ స్తోత్రం, అలాగే కనకధారా స్తోత్రం. ఈ ఐదు స్తోత్రాలను ఉదయం కానీ సాయంత్రం కానీ దీపాలు పెట్టే వేళల్లో చదవడం వల్ల మీ అప్పులన్నీ తీరిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భక్తి, శ్రద్ధలతో శుచి, శుభ్రత పాటిస్తూ మాత్రమే ఈ స్తోత్రాలు చదవాలని వివరిస్తున్నారు. అయితే ఈ ఐదు స్తోత్రాలు ఋషి ప్రోక్తమైనవని వీటికి ఎవరి ఉపదేశం అవసరం లేదని చెబుతున్నారు. దేవుడి ముందు దీపం వెలిగించి.. ఈ స్తోత్రాలు చదవడం వల్ల మీకున్న ఆర్థిక కష్టాలు అనతి కాలంలోనే తీరిపోతాయని చెబుతున్నారు.

Advertisement

Read Also : Hanuman Chalisa : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. హనుమాన్ చాలీసా చదవాల్సిందే!

Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు