Marraige tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈ తేదీని విష్ణుమార్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణువు అవతారాలకు చెందిన రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. విష్ణువును పూజించడానికి శనివారం కూడా మంచి రోజే. అయితే ఈ రోజున పూజలు చేయడం వల్ల వివాహ సమస్యలతో పాటు పలు రకాల సమస్యలను అధిగమించవచ్చునని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వయసు మీరిపోతున్న పెళ్లి కాకపోతే…. కొన్ని వారాల పాటు ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల కచ్చితంగా పెళ్లి అవుతుందని చెబుతున్నారు.
అయితే శని వారం రోజు ఉపవాసం ఉండాలట. అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి, పసుపు రంగు పండ్లను, పూలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలట. అలాగే పసుపు రంగులో ఉండే పదార్థాలను మాత్రమే ఉపవాసం తర్వాత తినాలట. శనగ పిండి లడ్డూలు, శనగ పిండి రోటీలు తినడం ఉత్తమం. అంతే కాకుండా సుందర కాండను పఠించడం కూడా చాలా మంచిది. వీటితో పాటు 21 శనివారాల పాటు నిరంతరం సుందరకాండ చదవడం వల్ల కచ్చితంగా వివాహం జరుగుతుందట. అలాగే సీతారాములతో కూడిన హనుమంతుడి చిత్రం పటం ముందే దీన్ని పారాయణం చేయాలట.
Read Also :Vasthu tip: లక్ష్మీ దేవి ఇంట్లోకి వవ్చే ముందు ఇఛ్చే సంకేతాలివే.. గుర్తుంచుకోండి!