Ap Movie Ticket Issue : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల విక్రయం ప్రభుత్వం చేపట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ టికెట్ల విక్రయం విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో దుమారం రేగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ఆన్లైన్ అమ్మకాలను జస్ట్ టికెట్స్ సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఆన్లైన్ టికెట్ల విషయాల గురించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలలో టికెట్ల ధరలు, ఇతర అంశాల మీద పూర్తీ వివరణ ఉంది. టికెట్ల విక్రయానికి నోడల్ ఏజెన్సీగా ఏపీఎఫ్డీసీకి సర్వీస్ ప్రొవైడర్ కు ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.
ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం అన్ని సినిమా థియేటర్లు APFDCతో తప్పనిసరిగా అగ్రిమెంట్ చేసుకోలి. అగ్రిమెంట్ చేసుకొని యెడల టిక్కెట్లు విక్రయించి, సినిమా ప్రదర్శించటానికి అవకాశం ఉండదు. అంతే కాకుండా నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారా అన్ని థియేటర్లు, ప్రైవేట్ సంస్థలు టిక్కెట్లు అమ్మకాలు చేయాలని ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో సర్టిఫికెట్ పై రెండు శాతం సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి థియేటర్ ఆన్లైన్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలను స్పష్టంగా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆన్లైన్ టికెట్ ల అమ్మకానికి అవసరమైన సదుపాయాలను థియేటర్ల వారే ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా కొత్త సినిమాలకు ఒక వారం ముందు నుండి మాత్రమే టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం సూచించింది. టిక్కెట్ల అమ్మకాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మల్టీప్లెక్స్ యాజమాన్యం వారు తిరస్కరించి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన వివరణ అనుకూలంగా ఉండటంతో
ప్రభుత్వ ఆన్ లైన్ టికెట్ల విధానానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also : Kondaa Movie: వర్మ “కొండా” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడూ రిలీజ్ అవుతుందంటే…!
Tufan9 Telugu News And Updates Breaking News All over World