Headache : ప్రస్తుత జీవన శైలిలో తలనొప్పి అనేది సాధారణమైన సమస్య మారిపోయింది, సాధారణ సమస్య కానీ బాగా వేధించే సమస్య అని కూడా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో వెంటనే తగ్గిపోతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా సమయం బాధిస్తుంది. దీనివల్ల కుటుంబంతో సమయం గడపలేరు, నలుగురితో కలిసి ఆనందంగా గడపలేరు. వృత్తిపరంగా కానీ ఇంకా ఏదైనా పని కానీ ఏకాగ్రతతో చేయలేరు.
కొంతమంది తలనొప్పి నుంచి ఉపశమనం కోసం మాత్రలు వాడుతూ ఉంటారు, కానీ వాటి నుంచి కూడా ఎప్పుడు పూర్తి ఉపశమనం ఉంటుంది అని చెప్పలేము. కానీ మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దీన్ని తగ్గించుకోవచ్చు.
తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు అల్లం టీ కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో అల్లం ఉపయోగిస్తున్నారు.ఇది భారతీయ వంటకాలలో విస్తృతంగా వాడుతారు. పరిశోధన ప్రకారం మైగ్రేన్ తలనొప్పి తీవ్రతను తగ్గించడంలో అల్లం ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఇది వికారం, వాంతులు వంటి లక్షణాలను కూడా తగ్గిస్తుంది.అల్లం యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.
తల నొప్పి నివారించడానికి నిద్ర చాలా ముఖ్యం. ప్రతి మనిషికి సరిపడా నిద్ర లేకపోతే శారీరక ,మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్రలేమి వలన జీవక్రియ రేటు నెమ్మదిస్తుంది. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది.
ఒక పరిశోధన ప్రకారం, 6 లేదా అంతకన్నా ఎక్కువ గంటలు నిద్రపోయే వారిలో తలనొప్పి తో బాధపడటం తక్కువగా ఉంది. 6 గంటల కన్నా తక్కువగా నిద్రపోయే వారిలో తలనొప్పి తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి రాత్రిపూట 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.ఇలా చేయడం వలన శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు.
ప్రస్తుత జీవన శైలిలో చాలా రకాల ఆరోగ్య సమస్యలకు యోగ ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల తలనొప్పి,ఒత్తిడి,మానసిక సమస్యలు చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. యోగా తలనొప్పి యొక్క ఫ్రీక్వెన్సీ ని తగ్గిస్తుంది. కాబట్టి యోగా అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి.
డీహైడ్రేషన్ కూడా తలనొప్పికి ఒక కారణం కావచ్చు. శరీరంలో నీరు తక్కువ అవడం డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. శరీరంలో నీరు శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి డీహైడ్రేషన్ గా ఉంచుకోవడం వల్ల కూడా తలనొప్పి నివారించవచ్చు.
ఇలా చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తలనొప్పిని తగ్గించుకోవచ్చు. మన దైనందిన జీవితంలో కొన్ని క్రమశిక్షణతో కూడిన అలవాట్లు చేసుకోవటం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World