Health Tips : మీరు ఆరోగ్యంగా ఉండాలంటే తిన్న తర్వాత ఈ అలవాట్లు మానుకోక తప్పదు ..!

Health Tips : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు. ఎవరికి వారు వ్యక్తిగత జీవితంలో నిమగ్నమై తినే ఆహారంపై ప్రత్యేక దృష్టిపెట్టరు. ఎక్కువ బిజీ కారణంగా తినే ఆహారం నుండి శారీరక శ్రమ వరకు మనందరిలో చాలా మార్పు వచ్చింది. అందుకే చాలా మంది ప్రజలు రక్తపోటు, థైరాయిడ్, పీసీఓడీ, మధుమేహం వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే తినే కొంచమైనా పౌష్టికాహారం తీసుకుంటే మనం ఎప్పుడూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటామంటున్నారు నిపుణులు. అంతేకాకుండా శరీరంపై ప్రభావం చూపే ఆహారానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తిన్న తర్వాత మనం అస్సలు తినకూడని పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

టీ, కాఫీ :

ఆహారం తిన్న తర్వాత టీ, కాఫీ తీసుకోవడం తరచుగా మనమందరం చూస్తుంటాం. ఇలా అస్సలు చేయకూడదు అని నిపుణులు అంటున్నారు. మీరు ఇలా చేస్తుంటే జాగ్రత్జ వహింఛక తప్పదు. దీని వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీ – కాఫీ తాగడానికి 1 గంట ముందు, 1 గంట తర్వాత ఎలాంటి ఆహారం తినకూడదు. టీ తాగితే అందులో ఉండే టానిన్ అనే రసాయనం ఐరన్ శోషణ ప్రక్రియను అడ్డుకుంటుంది. ఇది దాదాపు 87 శాతం తగ్గుతుంది. ఇది మీకు రక్తహీనత సమస్య, అలాగే చేతులు, కాళ్ళు, తలనొప్పి కలిగించడంతోపాటు ఆకలిని తగ్గిస్తుంది.

Advertisement

మద్యం తాగడం :

తిన్న వెంటనే ఆల్కహాల్ తీసుకోకండి. మీరు తిన్న తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే అది మీ జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది ప్రేగులపై నేరుగా చెడు ప్రభావాన్ని చూపుతుంది. భోజనానికి 20 నుంచి 30 నిమిషాల ముందు ఆల్కహాల్ తీసుకోండి లేదా తిన్న 1, 2 గంటల తర్వాత తీసుకోవాలి.

Advertisement

పండ్లు :

తిన్న తర్వాత పండ్లను తరచుగా తింటుంటారు. కానీ అలా ఎప్పటికీ చేయకూడదు. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదే.. కానీ భోజనం, రాత్రి భోజనం లేదా అల్పాహారం తర్వాత పండ్లను తినడం మంచిది కాదు. ఖాళీ కడుపుతో పండ్లు తినడం కూడా మంచిది కాదు.. ఇలా చేయడం వల్ల ఉదరం సంబంధిత సమస్యలు పెరుగుతాయి.

చల్లని నీరు :

Advertisement

వేసవిలో ప్రతి ఒక్కరూ తిన్న తర్వాత చల్లటి నీరు తాగుతుంటారు. కానీ అలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీరు జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కడుపులో సమస్యలు ఏర్పడి జీర్ణక్రియ సమస్యలు మొదలవుతాయి. తిన్న 30 నుంచి 45 నిమిషాల తర్వాత చల్లని నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

సిగరెట్ తాగడం :

తిన్న వెంటనే సిగరెట్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఈ విషయంలో మీరు కూడా ఇలాగే ఉంటే.. ఈ రోజు నుంచే ఈ అలవాటును మార్చుకోండి. తిన్న వెంటనే సిగరెట్ తాగడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని, దీని వల్ల కడుపులో అల్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel