Oily skin: చర్మంలో సెబమ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. ఇలా ఆయిల్ స్కిన్ ఏర్పడటం సహజమైన ప్రక్రియ… అయితే అధికంగా నూనె రిలీజ్ అయితే అప్పుడు మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. కనుక జిడ్డు చర్మం గలవారు ఇతరుల కంటే తమకు తాము ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి. Stylecrase.com లో ప్రచురించబడిన ఒక వార్త ప్రకారం.. జిడ్డుగల చర్మం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వారి చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయని.. నల్ల మచ్చలు లేదా డెడ్ స్కిన్ సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ఆయిల్ స్కిన్ ఉన్నవారు పగలు మాత్రమే కాదు రాత్రి సమయాల్లో కూడా స్కిన్ కేర్ ను తీస్కోవాలి.
క్లెన్సర్ తో శుభ్రం.. రాత్రి పడుకునే ముందు మీ జిడ్డు చర్మాన్ని క్లెన్సర్ తో శుభ్రం చేసుకోండి. దుమ్ము, ధూళి, తేమ కారణంగా చర్మం జిడ్డుగా మారుతుంది.
ఫేస్ మాస్క్ ఉత్తమం.. జిడ్డు చర్మం ఉన్న వారు వారానికి ఒకసారి రాత్రి పూట ముల్తానీ మట్టిని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరుస్తుంది. అలాగే మృత చర్మకణాలను తొలగిస్తుంది.
నాన్ ఆల్కహాల్ టోనర్.. ముఖానికి తగిన టోనర్ రాయడం అవసరం. చర్మాన్ని బట్టి టోనర్ ను కూడా ఎంచుకోవాలి. ఆయిల్ స్కిన్ గలవారు ఆల్కహాల్ ఫ్రీ టోనర్ ను ఉపయోగించండి. ఎందుకంటే ఇది పీహెచ్ స్థాయిని నియంత్రిస్తుంది.