...

Hibiscus : మందారం ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.. తెలిస్తే అస్సలే వదలరు..

Hibiscus : మందారం మొక్కకు ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో మందారం మొదటి వరుసలో ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ చెట్టు చేసే ప్రయోజనం చాలా చాలా ఎక్కువే. ఈ మొక్క ఆకులు, పూలు, బెరడు, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. వీటితో జాములు, సూపులు, సాస్ లను తయారు చేస్తారు.

మందారం చెట్టు పువ్వులను ఈజిప్ట్ తదితర ప్రాంతాల్లో కర్కాడే అనే పానీయం తయారు చేస్తారు. మందారంలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కడుపు క్యాన్సర్, లుకేమియా వంటి కొన్ని రకాల క్యాన్సర్లను దరి చేరకుండా కాపాడుతుంది మందారం.

Hibiscus
Hibiscus

బరువు తగ్గడానికి మందారం టీ అద్భుతంగా పని చేస్తుంది. మందారం చెట్టు ఆకులతో ఈ టీని తయారు చేయాలి. సాధారణంగా మనం తయారు చేసుకునే టీలోనే కొన్ని మందారం ఆకులను వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడపోసుకుని ఆ నీటిని తాగితే శరీరంలోని అనవసర కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఈ టీ ఆకలిని తగ్గిస్తుంది. అలాగే ఈ టీ తాగడం వల్ల విటమిన్ సి, ఖనిజాలు శరీరానికి అందుతాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. మందారం జుట్టు సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మందారం పూలను కొబ్బరి నూనెలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజూ ఈ నూనెను తలకు ఒత్తుగా పట్టించుకోవాలి. జుట్టు రాలకుండా ఉండేందుకు, చుండ్రు సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది.