...

Hair Problems: జుట్టు నల్లగా, ఒత్తుగా కావాలంటే ఈ నూనె రాయాల్సిందే..!

Hair Problems: జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో ఎక్కువ అవుతోంది. పూర్వ కాలంలో వృద్ధులో మాత్రమే మనం జుట్టు సంబంధిత సమస్యలను చూసే వాళ్లం. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుత తరుణంలో ఈ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడడం, జుట్టు రాలడం చుండ్రు జుట్టు చిట్లడం వంటి సమస్యలను మనం జుట్టు సంబంధిత సమస్యలుగా చెప్పుకోవచ్చు. జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించుకొని జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Advertisement


కానీ వాతావరణ కాలుష్యం మారుతున్న జీవన విధానం, పోషకాహార లోపం వంటి కారణాలు వల్ల జుట్టు రాలడంతో పాటు జుట్టు అందవిహీనంగా తయారవుతంది. జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి ఎంతో చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపూలను, నూనెలను వాడినప్పటికీ ఈ సమస్య నుంచి ఉపశమనం కల్గక బాధపడే వారు ఎంతో మంది ఉన్నారు. జుట్టు సంబంధిత సమస్యలను సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో నూనెను తాయరు చేసుకొని వాడడం వల్ల జుట్టును అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Advertisement

40 గ్రాముల కొబ్బరి నూనె, 40 గ్రాముల కలబంద ముక్కలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కలబందను సేకరించి వాటి అంచులకు ఉండే ముళ్లను తొలగించి ముక్కలుగా చేస్కోవాలి. ఈ కలబంద ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే కొబ్బరి నూనె కూడా వేయాలి. ఈ కలబంద ముక్కలుగా నల్లగా అయ్యే వరకు వేడి చేయాలి. ఈ నూనెను వడకట్టి పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత ఊ నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతిరోజూ తలకు రాయడం వల్ల జుట్టుగా నల్లగా అవుతుంది.

Advertisement
Advertisement