Health Tips: ఈ నాలుగు రకాల వంట నూనెలను వాడుతున్నారా.. అయితే ఈ వ్యాధి బారిన పడినట్లే?

Health Tips: ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహార పదార్థాల కారణంగా ఎన్నో రకాల ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఎంతో భయంకరమైన ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి అంటే చాలామంది జీవితం పై ఆశలు కూడా వదిలి పెట్టుకోవాల్సిందే. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.అయితే మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం వాడే వంట నూనెలల వల్ల క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉంది.

ముఖ్యంగా ఈ క్రింది తెలిపిన నాలుగు రకాల నూనెలను అధికంగా తీసుకునే వారు భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ నాలుగు రకాల వంట నూనెలు ఏమిటి అనే విషయానికి వస్తే… ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న, కేనూలా మరియు కాటన్ సీడ్స్, నూనెలను అధికంగా ఉపయోగించే వారు భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయి.కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement

ఇక ఈ నూనెలు తినడం వల్ల క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే..ఈ నూనెలలో పాలీ అన్శాచురేటెడ్ కొవ్వులను అధికంగా కలిగి ఉంటాయి. వీటిని వేడి చేసినప్పుడు కొవ్వులు ఆల్డిహైడ్ లుగా విచ్ఛిన్నం అవుతాయి. అందుకే నూనె వేడి చేసినప్పుడు ఒకరకమైన వాసన వస్తుంది. నూనె యొక్క వెలికితీత వాటిని ఆక్సీకరణం చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ నూనెలు ఎంతో ప్రమాదకరంగా మారుతాయి.అందుకే వీటిని తరచూ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కనుక వీటిని ఉపయోగించకపోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement