Health Benefits Of Maredu chettu : మారేడు చెట్టు శివునికి ఎంతో ప్రీతికరమైన వృక్షమని చెప్పాలి.మారేడు ఆకులతో స్వామివారికి పూజ చేయటం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెంది మన కోరికలు నెరవేరుస్తారు. ఈవిధంగా మారేడు దళాలు శివుని పూజకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.ఈ విధంగా ఈ మారేడు చెట్టు కేవలం పూజకు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ చెట్టు బెరడు నుంచి ఆకులు, కాయలు, వేర్లు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. మరి మారేడు చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
మారేడు ఆకుల చెట్టు రసాన్ని ప్రతిరోజు రెండు టీస్పూన్లు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల మలబద్ధకం కామెర్లు వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఇక ఈ చెట్లు పిందెలను ఆవుపాలలో మెత్తని మిశ్రమంలా తయారుచేసి అందులో చక్కెర కలుపుకుని తినడం వల్ల మలబద్దకం సమస్యలు తొలగిపోతుంది. ఇక గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వాంతుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా అధికంగా వాంతులు అయ్యే వారు మారేడు పండు గుజ్జు పది గ్రాములు తీసుకుని అన్నం వార్చిన నీటిలో కలుపుకుని తాగడం వల్ల వాంతుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
మానసిక రుగ్మతలతో బాధపడే వారు మారేడు చెట్టు బెరడును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీళ్ళు వేసి కషాయంగా మరిగించాలి. ఈ కషాయం వడబోసి త్రాగటం వల్ల మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. ఇకపోతే అధికంగా జుట్టు సమస్యలతో బాధపడేవారుమారేడు వేర్లను గోమూత్రంతో కలిపి నూరి రసాన్ని తీసి వడకట్టాలి. ఆ రసాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేయడం వల్ల జుట్టు సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా జుట్టులో పేన్లు ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా మారేడు చెట్టు పూజలోనే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా ఎంతో ప్రయోజనకరమని చెప్పాలి.
Read Also : Diabetes control : దొండాకులు మధుమేహలకు దేవుడిచ్చిన వరం..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World