Diabetes control : డయాబెటిస్ అనేది జీవ క్రియకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. నాసిరకం జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాగి చిన్న వయసులునే ప్రబలుతుంది. శరీరానికి ఇన్సులిన్ ఉత్పత్తి చాలా ముఖ్యం. ఇన్సులిన్ రక్తం నుంచి కణాలకు గ్లూకోజ్ ను రవాణా చేస్తుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. శరీరంలో సరైన మోతాదులో ఇన్సులిన్ తయారు కానప్పుడు అది బాధితుడి శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయనపుడు లేదా ఇన్సులిన్ తయారీని ఆపినపుడు.. రక్తంలో చక్కెర స్థఆయి వేగంగా పెరుగుతుంది. అయితే దీన్ని నివారించాలంటే సరైన డైట్ కచ్చితంగా పాటించాల్సిందే.
దొండ ఆకులు మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దొండతో పాటు దాని ఆకులు కూడా మధుమేహం చికిత్సలో కుండ్రు ఒక సహాయక, ప్రభావవంతమైన కూరగాయ అని చెప్పొచ్చు. దొండాకులు మధుమేహుల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇందులో విటామిన్లు, మినరల్స్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, వంటి లక్షణాలు ఉన్నాయి. అయితే దొండ ఆకులను మంచిగా కడిగి ఆరబెట్టాలి. అవి బాగా ఆరాకా.. మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని రోజూ గ్రాము చొప్పున తీసుకోవాలి. వీటిని నీళ్లలో లేదా పాలల్లో కలపుకొని తాగాలి. కొద్ది కాలంలోనే మంచి ఫలితాలను చూస్తారు.