Sugar Free Desserts : మధుమేహులు పండ్లు, స్వీట్లు, అన్నీ తినొచ్చు కానీ..!

Sugar Free Desserts : షుగర్‌ పేషంట్లు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా డైట్‌ పాటిస్తారు. తినే ఆహారం విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఆరోగ్యకర ఆహారం తీసుకుంటుంటారు. అయినా పలువురిలో అనేక సందేహాలు ఉంటాయి… ‘చక్కెరకు బదులుగా ఆర్టిఫీషియల్‌ స్వీట్‌నర్స్‌ తీసుకోవచ్చా?’, ‘పండ్లు తినడం మంచిదేనా?’, ‘మందులు వాడినా పథ్యం చేయాలా? ఇలాంటి మరిన్ని సందేహాలకు మరి సమాధానం చూసేయ్యండి.

మధుమేహుల్లో చాలామంది పిండిపదార్ధాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెడుతుంటారు. అయితే కాయగూరలు, పండ్లు, నట్స్‌, గింజలు.. వంటి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మోతాదులో పోషకాలను అందించవచ్చు అంటున్నారు నిపుణులు.

డయాబెటిస్ బాధితుల్లో చాలామంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఆర్టిఫీషియల్‌ స్వీట్‌నర్స్‌ వాడుతుంటారు. అయితే వీటిని మోతాదుకు మించి తీసుకున్నా మధుమేహం ఎక్కువవడంతో పాటు స్థూలకాయం బారిన పడే ప్రమాదమూ ఉంటుందంటా. ఒకవేళ కచ్చితంగా తీసుకోవాలనుకుంటే స్టీవియా, డేట్‌ షుగర్‌.. వంటివి ఎంచుకోమంటున్నారు నిపుణులు.

Advertisement
can-diabetics-eat-sweets-and-fruits
can-diabetics-eat-sweets-and-fruits

నిజానికి మధుమేహులకు పండ్లు మేలే చేస్తాయంటోంది అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ‘టైప్‌-2 మధుమేహం’ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతోంది. యాపిల్స్‌, అవకాడో, బ్లాక్‌బెర్రీస్‌, చెర్రీస్‌, కివీ, ద్రాక్ష, అరటిపండ్లు.. వంటివి తీసుకోవడం మేలంటున్నారు. అయితే మోతాదుకు మించకుండా తీసుకోవడం మర్చిపోవద్దు.

మందులు వాడుతున్నాం కాబట్టి స్వీట్స్‌ తిన్నా మధుమేహం అదుపులోనే ఉంటుందనుకుంటారు చాలా మంది. కానీ అలా ఉండకూడదంటున్నారు నిపుణులు. చక్కెరలు అధికంగా ఉండే స్వీట్స్‌ని అమితంగా తీసుకుంటే మాత్రం ముప్పు తప్పదంటున్నారు. కాబట్టి ప్రత్యేక సందర్భాల్లో మితంగా తీసుకుని తృప్తి పొందడం అన్నిటికీ శ్రేయస్కరం. అయితే ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నప్పటికీ.. మితంగా తీసుకుంటూ.. మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటూ.. అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపండండి.

Read Also : Corriander Benefits : ధనియాలతో డయాబెటిస్‌కు చెక్.. బ్లడ్ షుగర్ లెవల్స్ ఇలా నియంత్రణ..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel