Health Tips: మనం ఆహారం తయారు చేయడానికి ఉపయోగించే ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు వంటి వాటిని బాగా శుభ్రంగా కడిగి ఆహారం తయారు చేసుకుంటాము. ఆరోగ్యకరమైన ఆహారం కోసం కూరగాయలు , ఆకుకూరలు తో పాటు పాత్రలను కూడా శుభ్రంగా కడిగి వంట వండుతారు. కానీ మనం ఆహారం తయారు చేయడానికి ఉపయోగించే పాత్రల గురించి చాలా మందికి అవగాహన ఎటువంటి పాత్రలలో వంట చేయడం వల్ల ఆరోగ్యానికి ఏ పాత్రల వల్ల ఎంత నష్టం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా పూర్వకాలంలో మట్టి పాత్రలను వంట చేయటానికి ఉపయోగించే వారు. అన్నింటికన్నా మట్టిపాత్రలో వంట చేయడం చాలా శ్రేయస్కరం. మట్టిపాత్రలో వంట చేయటం వల్ల ఆహారం రుచికరంగా ఉండడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మట్టి పాత్రలలో వండిన ఆహార పదార్థాలు తినటం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు.
ప్రస్తుత కాలంలో చాలా మంది అల్యూమినియం,
నాన్ స్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వంట చేయటానికి ఉపయోగిస్తున్నారు. కానీ వీటివల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అల్యూమినియం పాత్రలలో వంట చేయడం వల్ల క్రమంగా అల్యూమినియం కరిగిపోయి ఆహార పదార్థాలలో కలిసిపోతుంది. అల్యూమినియం పాత్రలలో వండిన ఆహారాన్ని తినటం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యల ఎదుర్కోవల్సి వస్తోంది.
ఈ రోజుల్లో నూటికి 90 శాతం మంది ఆహారం వండటానికి నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారు. ఆహార పదార్థాలను వీటిలో ఉండటంవల్ల చాలా ప్రమాదం. అందువల్ల నాన్ స్టిక్ పాత్రలో ఆహారం ఉండటం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను కూడా వంట చేయటానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు క్రోమియం, నికెల్, సిలికాన్ ,కార్బన్‌లతో వంటి లోహాలతో తయారు చేస్తారు. వీటిలో ఆహారాన్ని ఉండటంవల్ల ప్రమాదం ఏమీ ఉండదని వైద్య నిపుణులు వెల్లడించారు.