Health Tips:మారిన జీవన విధానం, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడటం వల్ల ఆహారపు అలవాట్లు మారిపోయాయి. మన పూర్వీకులు వారి కాలంలో ఉదయం లేవగానే అల్పాహారంగా చద్దన్నం తిని రోజంతా అలసట లేకుండా పని చేసేవారు. వారి ఆహారపు అలవాట్లు కారణంగా వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు. కానీ ప్రస్తుత కాలంలో అందరూ దోశ,ఇడ్లీ, చపాతి అంటూ వివిధ రకాల వంటలు చేసుకుని అల్పాహారం గా తింటున్నారు.
చద్దన్నం తినే అలవాటు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో చద్దన్నం మంచి పౌష్టికహారం గా పని చేస్తుంది. వేసవికాలంలో అల్పాహారంగా మజ్జిగ కలుపుకొని చద్దన్నం తినడం వల్ల శరీరానికి బాగా చలువ చేస్తుంది.
అమెరికన్ న్యూట్రిషిన్ చేసిన పరిశోధనల్లో ఇందులో ఉండే బ్యాక్టీరియా పేగులకు ఎంతో మేలు చేస్తుందని నిరూపణ అయ్యింది.
వేసవికాలంలో చద్దన్నం తినటం వల్ల విటమిన్ బి 6, బీ12 అంది శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. వడదెబ్బ తగలకుండా మనల్ని కాపాడుతుంది.చద్దన్నం లో రాత్రి మజ్జిగ కలుపుకొని ఉదయం తినటం వల్ల ఎండ వల్ల కలిగే నీరసాన్ని నివారిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చద్దన్నం బాగా ఉపయోగపడుతుంది. చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే రక్తహీనత నుంచి బయటపడచ్చు. అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం దివ్యౌషధంలా పనిచేస్తుంది.