...

Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడిన బస్సు పదిమంది మృతి..!

Accident: ఈ మధ్యకాలంలో రోజు ఎక్కడో ఒకచోట ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాన్ని నడిపే వారి నిర్లక్ష్యం అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకీ వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

వివరాల్లోకి వెళితే…తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, భాకరా పేట ఘాట్‌ రోడ్డులో బస్సు అదుపుతప్పిన లోయలో పడింది. రాత్రి సమయం కావటంవల్ల బస్సుకు లైట్లు సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా మరో తొమ్మిది మంది మరణించారు.ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Advertisement

పోలీసులు వెంటనే మూడు అంబులెన్సులను తెప్పించి ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు రేపు ఉదయం ఎంగేజ్మెంట్ ఉండటంతో ధర్మవరం నుంచి తిరుపతి వైపు వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా..పెళ్లికొడుకు కూడా బస్సులోనే ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు 300 అడుగుల లోతు ఉన్న లోయలో పడి పోవడం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement