...

Diabetes: మీకు మధుమేహం ఉందా.. ఇది ఒకసారి ట్రై చేయండి.. మంచి ఫలితం ఉంటుంది

Diabetes: ఒంట్లోకి చక్కెర వ్యాధి వచ్చిందంటే చాలు కష్టాలు మొదలైనట్లే. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే విషయంలో ఆహారం అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

డయాబెటిస్ ఉన్న వారు రోజూ ఉదయం లేదా సాయంత్రం నాలుగైదు తులసి ఆకులను నమలాలి. పూర్తిగా నమిలి మింగేయ్యాలి. తాజా తులసి ఆకులను తీసుకుని వాటిని ప్రతి రోజు రాత్రి గ్లాసు నీటిలో నాన బెట్టాలి. మరుసటి రోజు ఆ నీటిని మొత్తం తాగేసి.. అందులోని తులసి ఆకులను మంచిగా నమిలి మింగాలి.

తులసి ఆకులను నీటిలో చక్కగా ఉడికించి. ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. తులసిని ఎలా తీసుకున్నా డయాబెటిస్ ఉన్న వారికి చాలా ప్రయోజనం చేకూరుతుంది. తులసి ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వీటి వల్ల ప్యాంక్రియాటిక్ బీటా సెల్ అలాగే ఇన్సులిన్ స్రావాన్ని మెరుగు పరుస్తుంది. కండరాల కణాల ద్వారా గ్లూకోజ్ ను మరింతగా సంగ్రహిస్తుంది. దాని వల్ల గ్లూకోజ్ రక్తంలోకి చేరదు.

తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తాయి. అలాగే డయాబెటిస్ సమస్యను నివారిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారిలో కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లిజరైడ్ పెరుగుతూ ఉంటుంది. వీటిని తగ్గించడంలో తులసి చాలా సమర్థవంతంగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.