...

Viral news: విమానంలోనే బాహాబాహి.. ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్నారుగా..

Viral news: సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని బాగుంటాయి. కొన్ని అంతగా నచ్చకపోవచ్చు. అయితే ప్రస్తుతం ఒక వీడియా తెగ హల్ చల్ చేస్తోంది. నెటిజన్స్ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అసలేం జరిగిదంటే.. ఓ విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్యాసెంజర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ప్రయాణికులను అరెస్టు చేయడం ఏమిటి అనుకుంటున్నారా.. అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే.

మాంచెస్టర్ నుండి అమ్ స్టర్ డాంకు వెళ్తున్న ఓ విమానంలో పెద్ద గొడవ జరిగింది. ప్రయాణికులు వాళ్లలో వాళ్లు కొట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులు మరో ప్రయాణికుడిపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో గొడవ మొదలైంది. మాటా మాట పెరగడంతో వాగ్వాదం చెలరేగింది. దీంతో వీరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఆ సమయంలో పైలట్, సిబ్బంది వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయినా కూడా కాసేపు కొట్లాట సాగింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒకరు ఈ గొడవను అంతా వీడియో తీశాడు. దానిని సదరు ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్త తెగ వైరల్ అవుతోంది.

విమానంలో ప్రయాణికుల మధ్య గొడవ జరిగిందని అధికారులు వెల్లడించారు. ఒకరినొకరు కొట్టుకున్నారని, పలువురికి గాయాలు కూడా అయినట్లు తెలిపారు. ఈ గొడవతో సంబంధం ఉన్న ఆరుగురు ప్రయాణికులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అసలు గొడవ ఎలా జరిగింది. దానికి కారకులు ఎవరూ.. ఎవరెవరూ దాడికి పాల్పడ్డారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.