Before death: చనిపోవడం అంటే ఏమిటి.. శరీరంలో నుంచి ప్రాణం ఎక్కడికి పోతుంది. పోయే ముందు అసలేం జరుగుతుంది. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం నిజంగా చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. జననం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి.. అసలేం ఆయా సందర్భాల్లో ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు.
వీటి గురించి పెద్ద వాళ్లు కానీ.. పండితులు కానీ చెబుతుంటే ఆసక్తిగా వింటూ ఉంటాం. చాలా మంది వేదాంతులు, పండితులు చెప్పే మాట ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు అతనికి లేదా ఆమెకు తెలుస్తుందట. ఆ సమయంలో సదరు వ్యక్తి వింతగా ప్రవర్తిస్తాడట. ఈ విషయాన్ని చాలా మంది కొట్టిపడేస్తారు. కానీ ఇందులో నిజం ఉందనేది వారి మాట.
చనిపోతామనే ముందు ఆ వ్యక్తి తనకు ఇష్టమైన కోరికను నెరవేర్చుకోవాలని తాపత్రయ పడతాడట. అందుకే ఉరి శిక్ష పడ్డ వ్యక్తికి చని పోయే ముందు ఆఖరి కోరిక ఏమిటి అని అడిగే సంప్రదాయం వస్తోందని అంటారు. ఆ కోరిక నెరవేరితేనే వారు సంతోషంగా తనువు చాలిస్తారు. ఇక చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి నరకం, స్వర్గానికి వెళ్లి అక్కడ… భూమిపై ఉన్నప్పుడు వారు చేసిన తప్పులకు వారే శిక్ష విధించుకుంటారని అంటారు.
కానీ అవి చనిపోయాక జరిగే అంశాలు. వాటి గురించి ఎవరికీ సరిగ్గా తెలిసే ఛాన్సు లేదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి చెప్పలేడు. బతికున్న వాడు అనుభవించలేడు కాబట్టి. కానీ చనిపోయే ముందు ఏం జరుగుతుందో అనే విషయంపై ఓ సైంటిస్ట్ పరిశోధన చేశాడు. చనిపోయే ముందు వ్యక్తుల మెదడుకు ఈఈఈజీ యంత్రాన్ని అమర్చి దాని గురించి తెలుసుకున్నాడు. చనిపోయే ముందు ఆ వ్యక్తి తన చిన్నతనంలో జరిగిన సంఘటనలు తలచుకుని ఆనందపడతాడంట.