Road Accident : కరీంనగర్‌లో కారు బీభత్సానికి నలుగురు బలి… అతివేగంతో గుడిసెల పైకి దూసుకెళ్లిన కారు

Updated on: January 30, 2022

Karimnagar Road Accident : రోడ్డు ప్రమాదాలపై పోలీసులు, ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా… కొందరు వాహనదారులు మాత్రం బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ఎదుటివారి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కరీంనగర్ సిటీలోని ప్రఖ్యాత కమాన్ చౌరస్తా సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు… రోడ్డు పక్కన గుడిసెల పైకి దూసుకుపోయింది.

అతి వేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు చక్రాల కింద నలిగిపోయి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కమాన్ చౌరాస్తా సమీపంలోని రెడ్డి స్టోన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ నగరంలో వేగంగా దూసుకువచ్చిన కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన సీస కమ్మరి వృత్తి చేసుకునే వారిపై దూసుకెళ్లింది. ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Karimnagar Road Accident :

Advertisement

ఈ ఘటనలో చనిపోయిన నలుగురు మహిళలే కావడం స్థానికులంతా తీవ్రంగా రోదిస్తున్నారు. గాయపడ్డ మరో తొమ్మిది మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూ నిర్వహించారు. ఇరుక్కుపోయిన కారును క్రేన్ తో బయటికి లాగి, గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also : Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్‌ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel