Capsicum Rings Recipe : ఎప్పుడు ఒకే రకమైన వంటలతో బోర్ కొట్టేసిందా? ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనుకుంటున్నారా? ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో చాలామంది ఏదైనా కొత్తగా రెసిపీ ట్రై చేసి తిందామని అనుకుంటుంటారు. ఎలాంటి వంటకం చేస్తే బాగుంటుంది అని తెగ ఆరాట పడుతుంటారు. చాలామంది చిరుతిండి ప్రియులు ఆయనియన్ రింగ్స్ తయారుచేసుకుంటారు ఫాస్ట్ ఫుడ్ క్షణాల్లో తయారై పోతుంది. ఇది కూడా తిని తిని బోర్ కొట్టేసింది అంటారా? అయితే ఆనియన్ రింగ్స్ బదులుగా ఈసారి ఇలా క్యాప్సికం రింగ్స్ ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు :
క్యాప్సికం 3( గుండ్రంగా చక్రాల్లా కట్ చేసుకోవాలి), శెనగపిండి- ఒక కప్పు, బియ్యం పిండి -ఒక టేబుల్ స్పూన్ ,కారం- తగినంత, ఉప్పు- తగినంత, బేకింగ్ సోడా- పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్- పావు టీ స్పూన్, నూనె -డీప్ ఫ్రైకి సరిపడా, నీళ్లు- తగినంత ఉండాలి.
తయారీ విధానం :
* ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి.
* అందులో శెనగపిండి, బియ్యప్పిండి, తగినంత ఉప్పు, తగినంత కారం వేయాలి.
* అదేవిధంగా బేకింగ్ సోడా, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని బాగా కలపాలి.
* కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి.
* గుండ్రంగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను అందులో ముంచి.. కాగుతున్న నూనెలో దోరగా వేయించాలి.
* అంతే వేడి వేడిగా కాప్సికం రింగ్స్ రెడీ.
వీటిని వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బావుంటాయి. టమాటో సాస్ లేదా చట్నీతో ట్రై చేస్తే ఇది చాలా రుచికరంగా ఉంటాయి.
Read Also : Tomato Pappu : టమాటా పప్పు ఒక్కసారి ఇలా చేస్తే.. ప్లేటు ఖాళీ కావడం ఖాయం?