Tomato Pappu : సాధారణంగా మన భారతీయ వంటకాలలో ఎక్కువ వినిపించే పేరు పప్పు. పప్పు కూర గురించి తెలియని వారంటూ ఉండరు. అలాగే ఈ పప్పు కూరని అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ పప్పు కూరలో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా టమాటా పప్పు రుచే వేరు. ఈ టమాటా పప్పుని ఒకసారి రుచి చూస్తే చాలా ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారు. అయితే ఈ టమాటా పప్పు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేస్తే పప్పు రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం టమాటా పప్పు ఎలా చేయాలి? పప్పు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవో తెలుసుకుందాం.
సాధారణం టమోటో పప్పు తయారు చేయటానికి చాలామంది కంది పప్పుకు బదులు పెసరపప్పు, సెనగ పప్పు కూడా ఉపయోగిస్తుంటారు. టమాట పప్పు చేయటానికి కందిపప్పు ఉపయోగించటం ద్వారా చాలా రుచికరంగా ఉంటుంది. టమాట పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కందిపప్పు- 200 గ్రాములు, టమాటాలు- 5, ఉల్లిపాయ- 1, చింతపండు – 10 గ్రాములు, పసుపు- ఒక హాఫ్ టేబుల్ స్పూన్, కారం పొడి -. ఒక టేబుల్ స్పూన్, పోపు దినుసులు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు – 10
ఇప్పుడు టమాటా పప్పు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా కందిపప్పును బాగా కడిగి నీటిలో 5 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత టమాటాలు, కొత్తిమీర, పసుపు, కారం, కొంచం నూనె, వెల్లుల్లి రెబ్బలు 5 అన్ని కలిపి వేయాలి. చింతపండు మాత్రం ఇప్పుడే వేయకూడదు. ఎందుకంటే చింతపండు ముందుగా వేస్తే కందిపప్పు టమాటాలు తొందరగా ఉడకవు. వీటన్నింటినీ కుక్కర్ లో వేసి 3,4 విజిల్స్ వచ్చేవరకు వరకు ఉడకనివ్వాలి . తర్వాత ప్రెసర్ తీసేసి చింతపండు వేసి కొంచం సేపు మెత్తగా ఉడికించాలి. ఈ సమయంలో ఒక కడాయి లో కొంచం నూనె వేడి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు చిటికెడు వేసి బాగా మరిగించి ఉడుకుతున్న పప్పులో పోపు వేయాలి. ఇలా చేయటం వల్ల టమాటా పప్పు చాలా రుచిగా ఉంటుంది. అయితే పప్పు ఇలా కుక్కర్ లో కాకుండా మట్టి కుండలో చేయటం వల్ల మరింత రుచిగా ఉంటుంది.
Read Also : LPG Gas Subsidy : ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలా.. అయితే ఇలా చేయండి?
Tufan9 Telugu News And Updates Breaking News All over World