Barley Tea Uses : కొందరిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ మొహంపై ముడతలు వస్తుంటాయి. చర్మం తన సహజత్వాన్ని కోల్పోయి డెడ్ స్కిన్‌లా మారడంతో ముడతలు కనిపిస్తాయి. వృద్ధాప్యం వచ్చాక చర్మం ముడతలు పడితే ఏమీ కాదు. కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ముడతలు వస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరూ వెక్కిరించడం మొదలు పెడతారు. దీంతో నలుగురితో కలిసి బయటకు వెళ్లాలన్నా.. కలిసి ఉండాలన్నా వెనుకాముందు ఆలోచించాల్సి వస్తుంది. అయితే, కొందరు స్కిన్ త్వరగా ముడతలు పడకుండా ఉండేందుకు చాలా రకాల రసాయనాలతో కూడిన క్రీమ్స్ వాడుతుంటారు.
దాని బదులు ఇంట్లోనే చక్కగా రెమిడీ తయారు చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసం బార్లీ గింజలను వాడాలని వెల్లడించారు. బార్లీ గింజలు చర్మానికి కాంతివంతంగా చేయడంలో దోహదపడుతుందని, అందులో చాలా ఔషధగుణాలు ఉన్నాయని తెలుస్తోంది.
కొరియన్స్ చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు బార్లీతో తయారు చేసిన ప్రత్యేకమైన ‘టీ’ని తాగుతారట.. ఇలా చేయడం వలన వీరి స్కిన్ కాంతివంతంగా మెరవడంతో పాటు ఫిట్ గా కనిపిస్తుందట. ఆ టీని మనం కూడా తయారు చేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. అందుకోసం ఏమి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Barley Tea Uses : బార్లీ ‘టీ’తో బ్యూటీ టిప్స్ మీకోసం..
బార్లీ గింజల నుంచి తీసిన ఆయిల్ కూడా చర్మాన్ని ఫిట్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీనిని ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ ఆయిల్‌తో మృదువుగా మర్దన చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ లాగా కూడా రాసుకుని కొద్ది సేపటికి కడిగేసుకుంటే చర్మం చాలా సాఫ్ట్‌గా తయారవుతుందని చెబుతన్నారు.
కొరియన్స్ ఎక్కువగా తమ చర్మ సౌందర్యం కోసం బార్లీ ద్వారా తయారు చేసిన ఎస్సెన్షియల్స్‌ను వాడుతారని తెలిసింది. బార్లీ ఆయిల్, నీటిలో మరిగించిన మిశ్రమాన్ని తరుచుగా చర్మానికి రాసుకుంటే ఫ్రీ రాడికల్స్, స్కిన్ డిసీసెస్ రాకుండా ఉంటాయట..
Read Also : Health Tips : బరువు తగ్గాలి అనుకునే వారికి బెస్ట్ టిప్ ఇదే… ట్రై చేయండి!