Home Remedies : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్యలలో దంతాల సమస్య కూడా ఒకటి. పళ్ళు పుచ్చిపోవటం, చిగుళ్ల నుండి రక్తశ్రావం అవ్వటం వంటి సమస్యలతో ఎక్కువమంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దంతక్షయంతో బాధపడేవారు నొప్పి భరించలేక దంతాలను తీసేయించుకుంటున్నారు. అయితే ఈ సమస్య నుండి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. దంతక్షయం నుండి విముక్తి కలిగించే చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
![Home Remedies : ఈ చిట్కాలను పాటిస్తే .. పుచ్చిపోయిన దంతాలు కూడా ముత్యాల్లా మెరుస్తాయి..? home-remedies-if-you-follow-these-tips-even-rotten-teeth-will-shine-like-pearls](https://tufan9.com/wp-content/uploads/2022/10/teeth.jpg)
శరీరంలో క్యాల్షియం లోపం వల్ల దంతాల సమస్యలు మొదలవుతాయి. అందువల్ల మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా అధిక శాతంలో చక్కెర తీసుకోవడం వల్ల శరీరానికి అందవలసిన క్యాల్షియం అందకపోవటం వల్ల దంతాలు తెలుసుగా మరి దంతక్షయం సంభవిస్తుంది. అందువల్ల రోజువారి ఆహారంలో చక్కర శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
అంతేకాకుండా మనం తెలియకుండా చేసే చిన్న పొరపాటు వల్ల కూడా దంత క్షయం వస్తుంది. సాధారణంగా టూత్ బ్రష్ ని ఆరు నెలలకు ఒకసారి మార్చాలి. అలాకాకుండా ఎక్కువ రోజులు టూత్ బ్రష్ వాడటం వల్ల కూడా దంత క్షయం వస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు రెండు నిమిషాల పాటు బ్రష్ చేసి గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి బాగా పుక్కిలించాలి. అలాగే విటమిన్స్, క్యాల్షియం, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి.
అలాగే ప్రతిరోజు బ్రష్ చూడు చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని ఆయిల్ ఫుల్ లింక్ చేయాలి ఆ తర్వాత కొంత సమయానికి ఆ కొబ్బరి నూనెను ఉమ్మి వేయాలి. ప్రతిరోజు ఇలా చేయటం వల్ల దంతాల సమస్యలు దరి చేరకుండా ఉండటమే కాకుండా దంతాలు ముత్యాల్లా మెరుస్తూ ఉంటాయి.
Read Also : Period Problems : నెలసరి సమస్యలా.. ఇది ట్రై చేయండి.. ప్రతినెలా నెలసరి అసలు ఆగదు..!