...

Health Tips : బరువు తగ్గాలి అనుకునే వారికి బెస్ట్ టిప్ ఇదే… ట్రై చేయండి!

Health Tips : ఉరుకులు పరుగుల జీవితంలో కరోనా వల్ల ఒక్కసారిగా అంతా ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరిగింది అని చెప్పాలి. ఇందు కోసం రోజు తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేయాలి అనుకుంటున్నారు. భోజనం చేసే ముందు బియ్యం, చపాతీలు పిండి పదార్థాలతో కూడిన ఆహరం అధికంగా తీసుకోవడం జరుగుతుంది.

కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించి, ప్రోటీన్ల వినియోగాన్ని భారీగా పెంచాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో భోజనంలో రైస్ తీసుకుంటే ఇబ్బంది లేదు. రాత్రి ఫుడ్‌లో రైస్ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై పలు సూచనలను కూడా చేస్తున్నారు. చపాతీలు, అన్నం రెండింటిని ప్రాసెస్ చేసిన తర్వాతే తయారవుతాయనేది గుర్తించుకోవాలి. చపాతీలతో పోలిస్తే బియ్యంలో ఫైబర్, ప్రోటీన్స్, కొవ్వులు తక్కువగా… కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

healt-tips-about-best-fodd-to-eat-in-night-time-for-weight-loss
healt-tips-about-best-fodd-to-eat-in-night-time-for-weight-loss

అయితే అన్నం తొందరగా జీర్ణమయ్యి ఆకలి వేస్తుంది. రోటీ, చపాతీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే ఆలస్యంగా జీర్ణమవుతుంది. త్వరగా ఆకలి కూడా వేయదు. బరువు తగ్గాలనుకునే వాళ్లు భోజనంలో తప్పనిసరిగా చపాతీని చేర్చుకోవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. రాత్రి సమయంలో అన్నం బదులు చపాతీ తింటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

చపాతీని కూరగాయలు, పప్పు, పెరుగుతో తీసుకోవాలని సూచిస్తున్నారు. బార్లీ, జొన్న, గోధుమలను కలిపిన చపాతీలలో ఫాస్పరస్, కాల్షియం, జింక్ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. రాత్రి 8 గంటల్లోగా ఆహరం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గందుకు ప్రయత్నించే వారు ఎవరైనా తప్ప కుండా ఈ టిప్స్ పాటించాలి. అప్పుడే మీరు అనుకున్న మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

Read Also : Devotional News : హిందువుల పూజా కార్యక్రమాల్లో రాగి పాత్రలనే ఎక్కువగా ఎందుకు వాడతారో తెలుసా ?