Vajravalli plant: వజ్రంతో సమానమైన వజ్రవల్లి మొక్క వల్ల కలిగే లాభాలు తెలుసా?

Vajravalli plant: కీళ్ల నొప్పులతో బాధ పడేవారు ప్రస్తుత కాలంలో ఎక్కువవుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు మొదలుకొని అందరూ ఈ సమస్యలతోనే బాధపుడుతున్నారు. అయితే వీటి వల్ల సరిగ్గా నడవలేక వారి పనులు వారు కూడా వారు చేస్కోలేరు. అయితే ఆయుర్వేదం ద్వారా ఈ నొప్పులను చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. అయితే మన ఇంట్లో, ఇంటి పరిసరాల్లో అనేక ఔషధ గుణాలు కల్గిన మొక్కలు చాలానే ఉన్నాయి. కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక వీటిని మనం ఉపయోగించుకోలేక పోతున్నాం. ఇలాంటి ఔషధ గుణాలు కల్గిన నల్లేరు మొక్క ఒకటి దీన్ని వజ్రవల్లిని హడ్ జోడ్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క తీగ జాతికి చెందినది. కంచెలకు పెద్ద పెద్ద వృక్షాలను ఈ మొక్క అల్లుకుని పెరుగుతూ ఉంటుంది.

Advertisement

Advertisement

అయితే వజ్రవల్లి మొక్క చాలా సులువుగా పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో దీనిని అలంకరణ మొక్కగా కూడా పెంచుకుంటూ ఉన్నారు. దీని కాడలు నాలుగు పలకలుగా ఉంటాయి. ఈ కాడలపై ఉండే పొట్టును తొలగించి పచ్చళ్లు, పులుసు కూరలు, వడియాల వంటి వాటిని చేసుకుని తనివచ్చు. ఎముకలను దృఢంగా చేసి కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో సహాయ పడుతుంది. ఈ మొక్కను తాకడం వల్ల కొందరిలో చేతులకు దురదలు వచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement

కనుక ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని ఈ మొక్కను ఉపయోగించుకోవాలి. నల్లేరు రసం, శుద్ధ గుగ్గిలం, మద్ది చెక్క పొడి, అశ్వగంధ చూర్ణం, అతి బల వేరు చూర్ణాన్ని సమ పాలల్లో తీసుకొని ముద్దగా నూరి రేగి పండు గింజంత పరిమాణంలో మాత్రలుగా చేసి ఉదయం, సాయంత్రం భోజనానికి గంట ముందు ఒఖ మాత్ర చొప్పున తీసుకోవడం వల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకలు దృఢంగా తయారై నొప్పులు తగ్గుతాయి.

Advertisement
Advertisement