ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా కాళ్లు, కీళ్లు, మోకాళ్ల నొప్పులతో తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే వీటిని తగ్గించుకోవడానికి వేలకు వేల డబ్బులు ఖర్చు చేస్తూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అంతే కాకుండా ప్రతిరోజూ మాత్రలు వేస్కుంటూ నానా అవస్థలు పడుతుంటారు. కానీ ఇదంతా ఏం అవసరం లేకుండా ఇంట్లోనే సులువుగా కాళ్ల, కీళ్ల నొప్పులతో పాటు వాతాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అయితే అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కలబంద గుజ్జు, పసుపు మిశ్రమాన్ని నొప్పులు ఉన్న చోట రాయాలి. ఆ తర్వాత దానిపై జిల్లేడు ఆకులు వేడి చేసి కట్టాలి. ఇలా ప్రతిరోజూ రాత్రి కట్టుకొని ఉదయం తీస్తే.. కీళ్ల నొప్పులన్నీ తగ్గిపోతాయి. అలాగే మధుమేహంతో బాధపపడే వారు తెల్ల జిల్లేడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు కట్టుకోవాలి. ఉదయం లేవగానే తీసేయాలి. ఇలా పదిహేను రోజులు కట్టుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వచ్చేస్తాయి.