...

Karthika deepam: ఇంట్లో ఉండే బాబు మోనిత కొడుకేనని తెలుసుకున్న సౌందర్య ఆనందరావులు ఏం చేయనున్నారు..?

Karthika Deepam Feb 23 Today Episode : రోజుకో ట్విస్ట్‌తో ఆధ్యంతం చూపరులను టీవీ ముందునుంచి కదలనివ్వకుండా చేస్తూ బుల్లితెరలో టాప్‌సీరియల్‌గా వెలుగొందుతున్న ధారావాహిక కార్తీకదీపం. మరి ఈ సీరియల్ గత ఎపిసోడ్‌లో ఆనందరావు తనకొడుకేనని తెలుసుకున్న మోనిత కార్తీక్‌ని తనకొడుకుని వెతికి తీసుకువచ్చి తనకి ఇస్తే కార్తీక్‌ని దీపను ఎటువంటి ఇబ్బంది పెట్టను అని చెప్పింది చూశాము. మరి ఈ ఎపిసోడ్‌లో సౌందర్యకు ఆనంద్‌ మోనిత కొడుకేనని తెలుసుకుని ఏం చేయనుందో తెలుసుకుందాం.

karthika deepam serial latest episode
karthika-deepam-latest-episode-highlights

ఆడిషన్స్‌కి వెళ్లి వచ్చేసరికి లేట్ అయిపోయింది పెద్ద మేడమ్.. ఇదిగో దీపక్క నాకో పని చెప్పింది. పిల్లల టీసీలు, రేషన్ కార్డులు, ఫొటోస్ అంటూ శ్రీవల్లి కోటేష్ ఫొటో‌తో పాటు మిగిలినవన్నీ టేబుల్ మీద పెడతాడు. అవి అందుకున్న సౌందర్య శ్రీవల్లి కోటేష్‌ల ఫొటోలు చూసి వీళ్లు ఎవరు అప్పారావు అంటుంది. ‘వీళ్ల ఇంట్లోనే మేడమ్ దీపక్క వాళ్లు ఉన్నది.. పాపం చనిపోయారు.. వాళ్ల బాబునే కదా దీపక్క వాళ్లు తెచ్చుకున్నారు’ అంటాడు. కోటేష్‌ని తీక్షణంగా చూసిన సౌందర్య.. అనుమానం వచ్చి.. ఫోన్‌లోని మోనిత బాబుని ఎత్తుకుని వెళ్లే వీడియో చూస్తుంది. ఇద్దరూ ఒక్కరే అని గుర్తించిన సౌందర్య షాక్ అవుతుంది.

మోనిత తన దగ్గర ఉన్న బాబు బొమ్మ దగ్గర కూర్చుని.. ‘ఆనందరావు గారు.. మీ నాన్న నన్ను కొట్టారు.. నేను కట్టుకున్న తాళిని తెంపేశారు.. కానీ మీరు మాత్రం సూపర్.. నాకు హెల్ప్ చెయ్యడానికి నాన్న దగ్గరకు వెళ్లి హాయిగా ఉన్నారు. కొన్నాళ్లు అక్కడే ఉండు అంటూ బొమ్మతో తెగ కబుర్లు చెప్తుంది.

ఓ పక్క సౌందర్య ఇదేం పరిస్థితి రా దేవుడా అనుకుంటూ మథనపడుతుంది. ఆనంద్ మోనిత కొడుకు అని దీప వాళ్లకి ఎలా చెప్పగలను? అంటూ.. సరిగ్గా అప్పుడే సౌర్య, హిమ బాబుని ఎత్తుకొచ్చి.. నాన్నమ్మా ఒకసారి పట్టుకో.. పాలు కలుపుకుని వస్తాం అని బాబుని సౌందర్య ఒడిలో పెట్టి వెళ్లిపోతారు. మరోవైపు కార్తీక్ దీప ఓ చోట ఆగి  డాక్టర్ బాబు.. మీరు చేస్తున్నది కరెక్టానా.. అసలు ఆ మోనితకి బాబుని వెతికి ఇస్తాను అని ఎందుకు మాటిచ్చారు అంటుంది. దీపా మనకు వేరే అవకాశం లేదు.. మోనితని వదిలించుకోవడానికి తనే మనకు అవకాశం ఇస్తోంది. పోనీ నువ్వు చెప్పు ఇంకో ఐడియా ఏదైనా ఉంది ఆ మోనితని వదిలించుకోవడానికి.. నిజానికి నాకు ఆ మోనితని చంపేసి జైలుకి వెళ్లాలని ఉంది. తెలుసా అంటూ బాధపడతాడు కార్తిక్‌.

ఇక సీన్‌ కట్‌చేస్తే ఆనందరావు కోసం సౌందర్య టాబ్లెట్స్ తీసుకుని వెళ్తుంది. ‘పిల్లలు ఆనంద్‌తో అనుబంధం బాగా పెంచుకుంటున్నారండీ..’ అంటూ మొదలుపెట్టి.. ‘మీకో విషయం చెప్పాలండీ.. మీరు టెన్షన్ పడతారేమోనని భయంగా ఉంది’ అంటుంది. ఫర్వాలేదు చెప్పు సౌందర్య అంటాడు ఆనందరావు.

మన ఇంట్లో ఉన్న ఆనంద్ ఎవరో కాదండీ.. ఆ మోనిత కొడుకు అంటూ నిజాన్ని చెప్పేస్తుంది. ఒక్కసారి గుండె ఆగినంత కంగారు పడిన ఆనంద్ రావు లేచి నిలబడతాడు. ఏం మాట్లాడుతున్నావ్ సౌందర్యా? అంటాడు. నిజమండీ అని చెప్తుంది. మీరు టెన్షన్ పడకండీ అంటుంది. ఎలా ఉండాలి సౌందర్య టెన్షన్ పడకుండా? అసలు ఇదేంటి సౌందర్య.. తిరిగి తిరిగి మనింట్లోనే మోనిత కొడుకు ఉండడం.. ఆనంద్ మోనిత కొడుకు కావడం ఏంటి సౌందర్య అంటాడు ఆనందరావు. మరి తదుపరి ఎపిసోడ్‌లో నిజం తెలుసుకున్న సౌందర్య ఆనందరావు ఏం చేయనున్నారో తెలుసుకుందాం.