Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. కరోనా వల్ల ఆలస్యం అయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఆకాశమే హద్దు అన్నట్లుగా అభిమానులు అంచనాలు పెంచుకొని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధ పాత్ర కి రామ్ చరణ్ సరిగ్గా సెట్ అయ్యాడు.

తాజాగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో సిద్ద పాత్ర గురించి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూ సిద్ధ పాత్రకి రామ్ చరణ్ కాకుండా మరెవరు అయితే బాగుండు అని మీరు భావించారు అని చిరంజీవిని ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ ఆచార్య సినిమా లో చరణ్ చేయకుంటే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు. మొదట్లో ఆ పాత్ర కోసం మహేష్ బాబు ని దర్శకుడు కొరటాల శివ సంప్రదించాడు. కానీ ఈ సినిమాలోని ఆ పాత్రకు ఉన్న వెయిటేజీ నేపథ్యంలో రామ్ చరణ్ తో ఆ పాత్ర చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చిరంజీవి కొరటాల శివ నిర్ణయాన్ని మార్చాడని సమాచారం.
మొత్తానికి మహేష్ బాబు నటించినా రాని క్రేజ్ రామ్ చరణ్ నటించడం వల్ల వచ్చింది. చిరంజీవి మరియు రాంచరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో పాటు, తండ్రి కొడుకులు అత్యంత కీలక పాత్రలో కనిపించడం వల్ల ఆచార్య సినిమా పై అంచనాలు రెట్టింపయ్యాయి. సినిమాలో ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ ఈ కనుల విందుగా ఉంటాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలయికలో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఆచార్య సినిమా ఆ లోటును తీసుకొస్తుంది. ఒకవేళ రామ్ చరణ్ ఈ సినిమాని చేయకపోతే పవన్ కళ్యాణ్ తో చిరంజీవి చేసేవాడు. ఆ కాంబో కూడా ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ ఈ సినిమాలో పవన్ నటించినా కూడా అద్భుతమయ్యేది.
Read Also : Naa Aata Soodu : ఆ స్పెషల్ డే ని కూడా వదలని ఈటీవీ మల్లెమాల.. మీ వాడకంకు దండంరా నాయన