HomeEntertainmentBigg boss6 telugu: బిగ్ బాస్ 6 పక్కా కంటెస్టెంట్లు వీళ్లే.. చూస్కోండి మరి!

Bigg boss6 telugu: బిగ్ బాస్ 6 పక్కా కంటెస్టెంట్లు వీళ్లే.. చూస్కోండి మరి!

Bigg boss6 telugu: బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కాబోతుంది. సోషల్ మీడియాలో.. బిగ్ బాస్ 6 కి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. అయితే కచ్చితంగా వెళ్లే వాళ్లని క్వారంటైన్ కి పంపించనట్లుగా సమాచారం. అందులో ఈసోరి చాలా మంది ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

శ్రీహాన్.. ఈయన పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. సీజన్ 5లో నాగార్జునతో స్టేజ్ షేర్ చేస్కున్న ఆయన సీజన్ 6లో కన్ఫార్మ్ అయిపోయాడు. అలాగే బిగ్ బాస్ షోలని యూట్యూబ్ లో రివ్యూ చేసి ఫేమస్ అయిన ఆదిరెడ్డి కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 6కి వెళ్లే వాళ్ల లిస్టులో చలాకీ చంటి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే జబర్దస్త్ ద్వారా ఫేమ్ సంపాదించిన పటాస్ ఫైమా కూడా బిగ్ బాస్ కు రాబోతుందట. అలాగే సింగర్ రేవంత్ కూడా బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

Advertisement

నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తీ అగర్వాల్ చెల్లిగా నటించి యాక్టర్ సుదీప కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతుందట. ఇప్పుడిప్పుడే ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సీరియల్ననటి శ్రీ సత్య కూడా బిగ్ బాస్ 6 కి కన్ఫార్మ్ అయింది. పండుగాడు సినిమాలో నటించిన వసంతి కృష్ణన్ కూడా ఈ సీజన్ లో కనిపించబోతుంది. హీరో అర్జున్ కల్యాణ్ కూడా బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

Advertisement

చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ కూడా వచ్చే బిగ్ బాస్ సీజన్ లో కనిపించబోతున్నారు. టీవీ 9 యాంకర్ ఆరోహి రావ్ కూడా బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించోబుతన్నట్లు తెలుస్తోంది. ఆర్జీవీ బర్త్ డే పార్టీ ద్వారా ఫేమస్ అయిన ఆర్టిస్ట్ సుల్తానా కూడా ఈసారి బిగ్ బాస్ కు రాబోతుంది. డీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపిక పిల్లి కూడ బిగ్ బాస్ కు రాబోతుంది. జబర్దస్త్ టీం నుంచి ట్రాన్స్ జెండర్ తన్మయి కూడా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతుంది.

Advertisement

యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన గీతా రాయల్ కూడా బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేయబోతుంది. జబర్దస్త్ నుంచి అప్పారావ్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular

Recent Comments