Vasthu tips: మీ ఇంట్లో అరటి చెట్టు ఉందా.. అయితే ఈ దిశలో అస్సలే పెంచకూడదు!

Vasthu tips:మనం ఎలంటి నిర్మాణాలు చేపట్టినా వాస్తు శాస్త్రం ప్రకారమే వాటిని కట్టుకుంటూ ఉంటాం. అంతేనా ఏఏ వస్తువులు ఎక్కడెక్కడ పెట్టాలో కూడా వాస్తు శాస్త్రం ప్రకారమే ఫాలో అవుతుంటాం. అయితే ముఖ్యంగా ఇంట్లో నాటే మొక్కలు సరైన దిశలో నాటితోనే దాని వల్ల లాభాలు కల్గుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాటిని అనుసరించకపోవడం వల్ల దాని దుష్ప్రభావాలను కుటుంబ సభ్యులపై పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

అరటి చెట్టులో విష్ణువు, దేవగురువు బృహస్పతి నివిసిస్తారని ప్రతీతి. ఈ చెట్టును నాటడం వల్ల ఇంట్లో వలన ఆనందం, శ్రేయస్సు వస్తుంది. అయితే దీన్ని తప్పుడు దిశలో నాటితే జీవితాన్ని కష్టాల పాలు చేస్తుందంట. అయితే దాన్ని ఏ దిశలో నాటితే లాభం చేకూరుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి చెట్టును ఆగ్నేయ దిశలో నాటకూడదు. పడమర దిక్కున నాటినా అశుభ ఫలితాలను కల్గజేస్తుంది.

అందుకే దిక్కుల్లో అరటి చెట్టును నాటకుండా ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం ముందు అరటి చెట్టును నాటకూడదు. ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశానికి ఆటంకం కల్గిస్తుంది. ఇంట్లోకి వచ్చే సంతోం, శ్రేయస్సుకు ఆటంకం కల్గుతుంది. అరటి చెట్టు దగ్గర ముళ్ల మొక్కలను ఎప్పుడూ నాట కూడదు. అరటి చెట్టు దగ్గర గులాబీలు లేదా కాక్టస్ వంటి మొక్కలను నాటొద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతాయి.